Telugu Global
Cinema & Entertainment

Saripodhaa Sanivaaram | సెకెండ్ సింగిల్ కూడా హిట్

Saripodhaa Sanivaaram - నాని హీరోగా నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ మూవీ నుంచి సెకెండ్ సాంగ్ రిలీజైంది.

Saripodhaa Sanivaaram | సెకెండ్ సింగిల్ కూడా హిట్
X

'సరిపోదా శనివారం' నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ గరం గరం నేచురల్ స్టార్ నాని క్యారెక్టర్ ని ప్రజెంట్ చేసింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు. మాస్ ఫీస్ట్ తర్వాత, మేకర్స్ ఈ రోజు సినిమా సెకండ్ సింగిల్ ఉల్లాసం సాంగ్ ని రిలీజ్ చేశారు, ఇది కూడా హిట్టవ్వడం విశేషం.

ఇది క్లాసికల్, జాజ్ మ్యూజిక్ ఫ్యూజన్, రొమాంటిక్ సాంగ్. సాంగ్ మూడ్ లైట్ గా ఉంది, విన్న వెంటనే ట్యూన్‌ ఎట్రాక్ట్ చేస్తోంది. సనరే రాసిన లిరిక్స్ నాని, ప్రియాంక మోహన్‌ల ఫీలింగ్స్ ని బ్యూటీఫుల్ గా ఎక్స్ ప్రెస్ చేస్తోంది. సంజిత్ హెగ్డే ఈ పాటను ఆలపించాడు.

లిరికల్ వీడియోలో నాని, ప్రియాంక మోహన్‌లు తమ నేచురల్ ఎక్స్ ప్రెషన్స్ తో విజువల్స్‌కు అందాన్ని తీసుకొచ్చారు. వివేక్ ఆత్రేయ సినిమాల్లో మ్యూజిక్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. సరిపోదా శనివారం సినిమా మ్యూజిక్ కూడా అలానే ఉంది.

పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న సరిపోదా శనివారంలో ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రానికి మురళి జి డీవోపీ, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.

First Published:  13 July 2024 5:23 PM GMT
Next Story