Dasara Movie Teaser Review: నాని మూవీ దసరా టీజర్ రివ్యూ
Nani's Dasara Movie Teaser Review: నాని తాజా చిత్రం దసరా. ఈ సినిమా టీజర్ లాంచ్ అయింది. రాజమౌళి చేతుల మీదుగా రిలీజైన ఈ టీజర్ ఎలా ఉందో చూద్దాం..

ఇప్పుడు లోకల్ అనే మాట లేదు. కంటెంట్ లో ఒరిజినాలిటీ ఉంటే చాలు. పాన్ ఇండియా లెవెల్లో క్లిక్ అవుతున్నాయి సినిమాలు. కాంతార దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అదే నమ్మకంతో కంటెంట్ ను నమ్ముకొని వస్తోంది దసరా మూవీ. పాన్ ఇండియా లెవెల్లో విడుదలకు సిద్ధం చేస్తున్న ఈ సినిమాలో నాని హీరో. రాజమౌళి చేతుల మీదుగా ఈరోజు సినిమా టీజర్ లాంచ్ చేశారు.
బొగ్గు గనులు ఉండే ఈర్లపల్లి అనే గ్రామంలో ఈ కథ నడుస్తుంది. "మందు అంటే మాకు వ్యసనం కాదు. అలవాటు పడిన సాంప్రదాయం" అంటూ మందుకొడుతూ హీరో నాని ఇంట్రడక్షన్ చూపించారు. ఊరిలో ఊరమాస్ గా తిరిగే హీరో, తన ఊరి కోసం ఏం చేశాడనే కోణంలో టీజర్ ను కట్ చేశారు.
టీజర్ లో నాని మాస్ అవతారం మెప్పించింది. అతడు మందు కొట్టే విధానం, సిగరెట్ వెలిగించే స్టయిల్ ఇనిస్టెంట్ గా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. తెలంగాణ యాసలో నాని చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. టీజర్ మొత్తం నాని ఎలివేషన్లు, సినిమా లుక్ అండ్ ఫీల్ ను చూపించడానికే కేటాయించారు. హీరోయిన్ కీర్తిసురేష్ కు ఇందులో స్థానం దక్కలేదు.
సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లో హైలెట్ గా నిలిచాయి. నాని నుంచి ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పూర్తిస్థాయి మాస్ సినిమా ఇది.
సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలకానుంది దసరా.