అహింస నుంచి మరో సాంగ్.. ఈసారి నాని వంతు
దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమౌతున్న సినిమా అహింస. ఈ సినిమా నుంచి సెకెండ్ సాంగ్ వచ్చింది. నాని రిలీజ్ చేశాడు.
BY Telugu Global17 Oct 2022 9:33 AM IST
X
Telugu Global Updated On: 17 Oct 2022 9:33 AM IST
వెండితెరపై ప్రేమకథలతో ఘన విజయాలు సాధించిన దర్శకుడు తేజ. ఈ దర్శకుడి నుంచి వస్తున్న తాజా చిత్రం అహింస. దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమౌతున్న ఈ సినిమాను ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ చిత్రం నుండి 'కమ్మగుంటదే' పాటని హీరో నాని రిలీజ్ చేశాడు. ఆర్పీ పట్నాయక్ ఈ పాటని అందమైన జానపద మెలోడి స్టయిల్ లో కంపోజ్ చేశారు. వినగానే ఆకట్టుకునేలా ఉంది ఈ పాట.
ఈ పాటలో అభిరామ్, గీతిక కెమిస్ట్రీ బాగుంది. కాల భైరవ, కీర్తన శ్రీనివాస్ ఈ పాటని ఆలపించారు. చంద్రబోస్ అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫస్ట్ సింగిల్ 'నీతోనే నీతోనే' ఇప్పటికే హిట్టవ్వగా.. ఇప్పుడు'కమ్మగుంటదే' పాట కూడా ఆ దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది.
Next Story