Nani | నాని మూవీ బడ్జెట్ రూ.100 కోట్లు?
Nani - నాని సినిమాల బడ్జెట్ ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. తాజాగా ఈ బడ్జెట్ విలువ వంద కోట్ల రూపాయలకు చేరుకుంది.
దాదాపు నాలుగేళ్ల నుంచి నాని సినిమాల బడ్జెట్స్ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా పీక్ స్టేజ్ కు చేరింది. నాని కొత్త సినిమాకు ఏకంగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుంటున్నారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాని. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమాకు ఏకంగా వంద కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుంటున్నారు. మూవీ పూర్తయ్యేసరికి మరో 20 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఇంతకుముందు దసరా వచ్చింది. దాన్ని 60 కోట్లలో పూర్తిచేశారు. ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. ఆ తర్వాత హాయ్ నాన్న వచ్చింది. దాని బడ్జెట్ 70 కోట్లు. అది కూడా బ్రేక్ ఈవెన్ అయింది. దీంతో నాని-శ్రీకాంత్ ఓదెల సినిమాకు 100 కోట్లు కేటాయించారు.
నాని సినిమాలకు నాన్-థియేట్రికల్ బాగా వర్కవుట్ అవుతోంది. అతడి సినిమాల ఓటీటీ, శాటిలైట్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. అందుకే అతడి రెమ్యునరేషన్ తో పాటు, మూవీ బడ్జెట్స్ కూడా పెరుగుతున్నాయి.