Telugu Global
Cinema & Entertainment

Nani | అరుదైన రికార్డ్ సృష్టించిన నాని

Nani - నాని తాజా చిత్రాలు దసరా, హాయ్ నాన్న. ఈ రెండు సినిమాలతో అరుదైన రికార్డ్ సృష్టించాడు నేచురల్ స్టార్.

Nani | అరుదైన రికార్డ్ సృష్టించిన నాని
X

నేచురల్ స్టార్ నాని నిలకడగా హిట్స్ ఇచ్చే హీరోల్లో ఒకడు. నాని గత రెండు సినిమాలు- దసరా, హాయ్ నాన్న మంచి విజయాలు సాధించాయి. హై బడ్జెట్‌తో రూపొందిన దసరా విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు, 2023లో బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. హాయ్ నాన్న కూడా కమర్షియల్ హిట్ అయింది. కంటెంట్, పెర్ఫార్మెన్స్ , టెక్నికల్ గా ప్రశంసలు అందుకుంది.

నాని నటించిన ఈ రెండు సినిమాలు సైమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో రికార్డ్ నామినేషన్‌లు దక్కించుకున్నాయి. సైమా అవార్డుల్లో హాయ్ నాన్నకు 10 నామినేషన్లు దక్కగా, ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో 9 విభాగాల్లో నామినేట్ అయింది. ఇక దసరా సినిమాకు సైమా అవార్డుల్లో 11 నామినేషన్లు దక్కగా, ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో 8 నామినేషన్లు వచ్చాయి.

ఈ రెండు సినిమాలతో ఇద్దరు కొత్త దర్శకులు పరిచయం కావడం విశేషం. దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల, హాయ్ నాన్నతో శౌర్యువ్ దర్శకులుగా పరిచయమయ్యారు. శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ ఇద్దరూ ఉత్తమ దర్శకుల విభాగంలో నామినేట్ అవ్వడం మరో విశేషం.

దసరాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తే, హాయ్ నాన్నాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ సినిమాలతో నామినేట్ అయ్యారు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో మేజర్ అవార్డుల్లో ఇన్ని నామినేషన్లు అందుకోవడం నాని సాధించిన అరుదైన రికార్డ్.

First Published:  18 July 2024 4:57 PM GMT
Next Story