Hi Nanna | ఓవర్సీస్ లో కొనసాగుతున్న నాని హవా
Hi Nanna - నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ఓవర్సీస్ లో హిట్టయింది. మొదటి వారాంతం ముగియకుండానే ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది.

నాని తాజా చిత్రం హాయ్ నాన్న. శౌర్యవ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, వైరా క్రియేషన్స్ బ్యానర్ పై నాని నటించిన సినిమా ఇది. కేవలం ఎమోషన్స్ పై ఆధారపడి తీసిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభంలో వసూళ్లు పెద్దగా రాలేదు. అయితే ఓవర్సీస్ లో మాత్రం మొదటి రోజు నుంచే హాయ్ నాన్న సినిమా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
వీకెండ్ కూడా గడవకముందే హాయ్ నాన్న సినిమా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. ఈ సినిమాతో ఓవర్సీస్ లో తన పట్టును మరోసారి నిలుపుకున్నాడు నాని. ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడం నానికి ఇది 9వ సారి. హాయ్ నాన్నతో కలిపి అతడు నటించిన 9 సినిమాలు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ వసూళ్లు సాధించాయి.
ఈ సెగ్మెంట్ లో అందరికంటే ముందు మహేష్ బాబు ఉన్నాడు. మహేష్ నటించిన 13 సినిమాలు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లో ఉన్నాయి. ఆ తర్వాత స్థానం నానిదే.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హాయ్ నాన్న సినిమాకు రెండో రోజు నుంచి వసూళ్లు పెరిగాయి. ఆదివారం రోజున కూడా ఈ సినిమాకు చెప్పుకోదగ్గ కలెక్షన్లు వచ్చాయి. పాజిటివ్ మౌత్ టాక్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది.