Telugu Global
Cinema & Entertainment

Nani | బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్న నాని

Nani - సరిపోదా శనివారం సినిమా కచ్చితంగా హిట్టవుతుందంటున్నాడు హీరో నాని. ఇది అందరికీ కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడు.

Nani | బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్న నాని
X

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్-అడ్వెంచర్‌ సినిమా, ఇప్పటికే ప్రచారంతో దుమ్ముదులుపుతోంది. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని మాట్లాడాడు.

ప్రెస్ మీట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. "ఆడియన్స్ తో పాటు సినిమా చూడటానికి ఎదురుచూస్తున్నాను. సుదర్శన్ 35 ఎంఎం కి మార్నింగ్ 11 షోకి వస్తున్నాను. కలసి సెలబ్రేట్ చేసుకుందాం. దానయ్య గారు ఆర్ఆర్ఆర్ లాంటి సక్సెస్ చూసిన తర్వాత అంత తొందరగా ఏదీ ఆనదు. కానీ ఇది ఆనుతుందనే నమ్మకం ఉంది." అన్నాడు.

ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను 24వ తేదీన నిర్వహించబోతున్నారు. ఓ ప్రముఖ నటుడ్ని ఈ వేడుకకు ఆహ్వానించాలనుకుంటున్నారు. ఈసారి దర్శకుడు వివేక్ ఆత్రేయ, పూర్తిగా ప్రచారానికి దూరమయ్యాడు. సినిమా రిలీజ్ తర్వాత అతడు మీడియాతో మాడ్లడతాడు.

First Published:  21 Aug 2024 5:32 PM GMT
Next Story