Telugu Global
Cinema & Entertainment

Actor Nani | విజయ్ దేవరకొండకు క్షమాపణలు చెప్పిన నాని

Actor Nani - హీరో నాని, విజయ్ దేవరకొండకు క్షమాపణలు చెప్పాడు. తన ఈవెంట్ లో తప్పు జరిగిందని ఒప్పుకున్నాడు.

Actor Nani | విజయ్ దేవరకొండకు క్షమాపణలు చెప్పిన నాని
X

నాని హాయ్ నాన్నా ఈవారం విడుదల కానుంది. నాని ఈ చిత్రాన్ని చాలా దూకుడుగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ, రష్మిక ఫొటోల్ని వాడడంపై తీవ్ర నిరసన ఎదుర్కొంటున్నాడు నాని.

'హాయ్ నాన్నా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్-రష్మిక ఫొటోలు చూపించి, ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉన్నట్టు అధికారికంగా చెప్పినట్టయింది. ఇది చాలామందికి షాక్ కలిగించింది. సదరు హీరోహీరోయిన్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినట్టే. దీంతో యూనిట్ పై, నానిపై ట్రోలింగ్ మొదలైంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని, ఈ అంశంపై స్పందించాడు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, విజయ్ దేవరకొండ, రష్మికకు క్షమాపణలు చెప్పాడు.

“ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చాలా మంది వ్యక్తులు పాల్గొన్నారు. ఎవరో అత్యుత్సాహంతో ఆ పని చేశారు. అతడ్ని పిలిచి మందలించడం కూడా కరెక్ట్ కాదు. తప్పు జరిగిపోయింది. విజయ్, రష్మిక నా వ్యక్తులు. ఈ అంశాన్ని వాళ్లు పట్టించుకోరనే విషయం నాకు తెలుసు. కానీ, అది ఎవరినైనా నొప్పించి ఉంటే, నేను హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను."

మృణాల్ ఠాకూర్‌ హీరోయిన్ గా నటించిన 'హాయ్ నాన్న' డిసెంబర్ 7న విడుదల కానుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

First Published:  3 Dec 2023 6:45 PM IST
Next Story