Telugu Global
Cinema & Entertainment

Saripdhaa Sanivaaram | నాని నుంచి యాక్షన్ పోస్టర్

Saripdhaa Sanivaaram - నాని కొత్త సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమా నుంచి నాని యాక్షన్ లుక్ రిలీజైంది.

Saripdhaa Sanivaaram | నాని నుంచి యాక్షన్ పోస్టర్
X

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన నాట్ ఏ టీజర్ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమాలోని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ రిలీజ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా సరిపోదా శనివారం మేకర్స్ ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ నాని పవర్ ప్యాక్డ్ లుక్ లో ఆదరగొట్టాడు. అతడి ఫేస్ కనిపించనప్పటికీ.. చేతిలో ఆయుధం పట్టుకుని పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించాడు. మూవీలో ఫుల్ యాక్షన్ ఉంటుందని ఈ పోస్టర్ చూస్తే అర్ధమౌతోంది.

ఈ చిత్తాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.

First Published:  1 Aug 2024 5:21 PM GMT
Next Story