Telugu Global
Cinema & Entertainment

క‌ళ్యాణ్ రామ్ సినిమాకు మెగా టైటిల్‌

ఎన్టీఆర్ ఆర్ట్స్‌, అశోక క్రియేష‌న్స్ బ్యాన‌ర్ల‌పై అశోక్‌ వర్ధన్‌ ముప్ప, సునిల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ముంబై భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.

క‌ళ్యాణ్ రామ్ సినిమాకు మెగా టైటిల్‌
X

బింబిసార మూవీతో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చిన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌.. గ‌త ఏడాది అమిగోస్, డెవిల్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. వీటిల్లో అమిగోస్ ఫ్లాప్ అవ్వ‌గా.. డెవిల్ యావ‌రేజ్‌గా ఆడింది. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ త‌న 21వ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు ప్రదీప్ చిలుకూరితో చేస్తున్నాడు. NKR21 వ‌ర్కింగ్ టైటిల్ తో కొద్ది నెల‌ల క్రిత‌మే ఈ సినిమా ప్రారంభం అయింది.

ఎన్టీఆర్ ఆర్ట్స్‌, అశోక క్రియేష‌న్స్ బ్యాన‌ర్ల‌పై అశోక్‌ వర్ధన్‌ ముప్ప, సునిల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ముంబై భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా కీల‌క పాత్ర‌లో అల‌రించ‌బోతున్నారు. విజ‌య‌శాంతి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన గ్లింప్స్ వీడియోకు సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇదిలా ఉంటే.. క‌ళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న ఈ లేటెస్ట్ మూవీకి మెరుపు అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్న‌ట్లు ఫిల్మ్ స‌ర్కిల్స్ లో బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌థ ప‌రంగా సినిమాకు మెరుపు టైటిల్ బాగా సెట్ అవుతుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఆల్మోస్ట్ అదే టైటిల్ ను లాక్ చేయ‌వ‌చ్చ‌ని కూడా అంటున్నారు.

కాగా, గ‌తంలో మెరుపు టైటిల్ తో గ్లోబ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా బంగారం ఫేమ్ ధరణి ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా ప్రారంభ‌మైంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ చిత్రం మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ కోసం రిజిస్ట‌ర్ చేయించిన మెరుపు టైటిల్ ను ఎవ‌రూ ట‌చ్ చేయ‌లేదు. కానీ ఇప్పుడు ఈ మెగా టైటిల్ తో క‌ళ్యాణ్ రామ్ సినిమా రాబోతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

First Published:  27 Jun 2024 10:49 AM GMT
Next Story