Telugu Global
Cinema & Entertainment

నరేంద్రమోడీకి నాగార్జున థాంక్స్‌.. ఎందుకంటే?

'మన్‌ కీ బాత్‌' కార్యక్రమంలో ప్రధాని ఏఎన్నార్‌ ను గౌరవించడంపై ఆనందం వ్యక్తం చేసిన నాగార్జున

నరేంద్రమోడీకి నాగార్జున థాంక్స్‌.. ఎందుకంటే?
X

భారతీయ సినిమాకు అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడటంపై నటుడు నాగార్జున స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. 'ఐకానిక్‌ లెజెండ్స్‌తోపాటు మా నాన్న ఏఎన్నార్‌ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరం. ఏఎన్నార్‌ దూరదృష్టి, ఇండియన్‌ సినిమాకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్పూర్తి' అని నాగార్జున పేర్కొన్నారు.

ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమంలో ప్రధాని పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటారనే విషయం విదితమే. ఈ ఏడాది చివరి ఎపిసోడ్‌లో ఏఎన్నార్‌, బాలీవుడ్‌ డైరెక్టర్‌ తపన్‌ సిన్హా, రాజ్‌కపూర్‌ ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధాని వారిని కొనియాడారు. అక్కినేని.. తెలుగు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారన్నారు. ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలు చాలా చక్కగా చూపెట్టేవారని పేర్కొన్నారు. తపన్‌ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేశాయని, రాజ్‌కపూర్‌ తన సినిమాల ద్వారా భారతదేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారన్నారు.మహ్మద్ రఫీ కాలాతీత స్వరం ప్రేక్షకులను ప్రతిధ్వనిస్తూనే ఉందన్నారు

భారతీయ చలనచిత్ర రంగంవైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని ప్రధాని అన్నారు. తొలిసారి వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమావేశాలను వచ్చే ఏడాది మన దేశంలో నిర్వహించబోతున్నామని ప్రధాని చెప్పారు. ఈ సమావేశాల్లో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారని తెలిపారు.

First Published:  30 Dec 2024 4:29 AM IST
Next Story