Telugu Global
Cinema & Entertainment

Thandel | తండేల్ షూటింగ్ అప్ డేట్స్

Nagachaitanya's Thandel - నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా తండేల్. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం.

Thandel | తండేల్ షూటింగ్ అప్ డేట్స్
X

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ "తండేల్". తాజాగా ఈ సినిమా వైజాగ్, శ్రీకాకుళం షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

నిజజీవిత ఘటనల నుంచి ప్రేరణ పొంది తెరకెక్కుతోంది "తండేల్" సినిమా. ఇదొక యాక్షన్ బేస్డ్ లవ్ స్టొరీ. ఇందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుడిగా చైతూ కనిపించబోతున్నాడు. దీని కోసం శ్రీకాకుళం యాసలో మాట్లాడ్డం నేర్చుకున్నాడు.

మేకర్స్ వైజాగ్, శ్రీకాకుళంలోని సహజమైన, అందమైన లోకేషన్స్ ని ఎంచుకొని షూట్ చేస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి తో పాటు ఇతర కీలక నటీనటులపై తాజా షెడ్యూల్ లో కొన్ని సీన్స్ తీశారు. నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ ఇందులో డి-గ్లామరస్ గా కనిపించనున్నారు.

దర్శకుడు చందూ మొండేటి పాత్రల గెటప్‌లు, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, ప్రాంతీయ యాస ప్రామాణికంగా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్‌, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌.




First Published:  23 Jun 2024 1:58 AM GMT
Next Story