Telugu Global
Cinema & Entertainment

Dhootha | చైతూ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది

NagaChaitanya - కెరీర్ లో తొలిసారి ఓ వెబ్ సిరీస్ చేశాడు నాగచైతన్య. త్వరలోనే అది స్ట్రీమింగ్ కు రాబోతోంది.

Dhootha | చైతూ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది
X

నాగచైతన్య ఓటీటీ డెబ్యూ దూత. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో రానున్న ఈ వెబ్ సిరీస్ పై మొన్నటివరకు చాలా అనుమానాలుండేవి. అసలు సిరీస్ వస్తుందా రాదా అంటూ చర్చ జరిగింది. ఓ దశలో అమెజాన్ ఈ వెబ్ సిరీస్ ను పక్కనపెట్టినట్టు కూడా కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు దూతకు లైన్ క్లియర్ అయింది.

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించిన సిరిస్ 'ధూత'. సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో నాగచైతన్య ప్రధాన పాత్ర పోషించాడు. పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్, ప్రాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లోని ప్రైమ్ మెంబర్స్ కు డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సిరీస్‌ అందుబాటులోకి వస్తుందని అమెజాన్ ప్రకటించింది. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్‌లున్నాయి. ఇది క్లిక్ అయితే సీజన్-2 కూడా ప్లాన్ చేస్తారు.

ఇందులో సక్సెస్ ఫుల్ జర్నలిస్ట్ సాగర్ పాత్రను పోషించాడు నాగచైతన్య. తనకి కొన్ని ఊహించిన ఘటనలు, మిస్టీరియస్ మరణాల, అతీంద్రియ సంఘటనలు ఎదురై, అతని కుటుంబంపై నీడలా వెంటాడుతాయి. వాటిని సాగర్ ఎలా ఎదుర్కొన్నాడనేది స్టోరీ. 8 ఎపిసోడ్‌ల సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ కీలక పాత్రలలో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోనున్నారు.

ప్రముఖ ఎడిటర్ నవీన్ నూలి, యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ ఈ వెబ్ సిరీస్ కు వర్క్ చేశారు. ఇప్పటికే చైతూ కుటుంబం నుంచి వెంకటేశ్, రానా ఓటీటీ డెబ్యూ ఇచ్చారు. ఇప్పుడు చైతూ తన ఓటీటీ సిరీస్ తో ఎలా మెప్పిస్తాడో చూడాలి.

First Published:  16 Nov 2023 9:35 PM IST
Next Story