థాంక్యూ సినిమా నన్ను మార్చేసింది
థాంక్యూ సినిమా ప్రమోషన్ లో భాగంగా మరోసారి మీడియా ముందుకొచ్చాడు నాగచైతన్య. ఓ వ్యక్తిగా ఇంకాస్త ఎదిగానని చెబుతున్నాడు.
ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతున్న థాంక్యూ సినిమా తనపై చాలా ప్రభావం చూపించిందంటున్నాడు నాగచైతన్య. ఓ వ్యక్తిగా తను చాలా మారానని, అంతకంటే ముందు అమీర్ ఖాన్ తో చేసిన సినీప్రయాణంలో మరిన్ని జీవిత పాఠాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. థాంక్యూ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ హీరో ఏమన్నాడో.. బ్యాక్ టు బ్యాక్ చూద్దాం..
- థాంక్యూ సినిమాతో వ్యక్తిగా నేను కూడా చాలా మారాను. అంతకు ముందు మనసులో ఉన్న విషయాలను సగమే బయటకు చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీకి మరింత క్లోజ్ అయ్యాను. చాలా బాగా వాళ్లతో కలిసిపోతున్నాను.
- 16 ఏళ్ల కుర్రాడిగా కనపడటానికి నాకు ప్రొడక్షన్ వాళ్లు సపోర్ట్ చేసి మూడు నెలల సమయం ఇచ్చారు. ఆ సమయంలో వర్కవుట్స్ చేయటంతో పాటు బాడీ లాంగ్వేజ్ పరంగా కొన్ని వర్క్ షాప్స్ కూడా చేశాను. నాకు అలాంటి ట్రాన్సఫరమేషన్స్ అంటే చాలా ఇష్టం. ప్రతి స్క్రిప్ట్‌లోనూ అది దొరకదు. ఈ సినిమాలో దొరికింది. చాలా ఎగ్జయిట్ అయ్యే చేశాను. ఇప్పుడంటే నా శరీరం కూడా సపోర్ట్ చేస్తుంది. మరి ఫ్యూచర్‌లో కుదురుతుందో లేదో చూడాలి.
- హిందీ ఆడియెన్స్ నన్ను యాక్సెప్ట్ చేయాలి. అలా చేస్తే అప్పుడు బాలీవుడ్ సినిమాల గురించి ఆలోచిస్తాను. ఇప్పటికైతే బాలీవుడ్ సినిమాలేవీ ఒప్పుకోవటం లేదు.
- దూతలో హీరోయిన్ లేదు. క్యారెక్టర్ బేస్ చేసుకుని రన్ అవుతుంది. నేను డైరెక్టర్స్‌ని బాగా నమ్ముతాను. డైరెక్టర్ ఎంత బాగా చెబితే అంత బాగా నటిస్తాను. ఆడియెన్స్ నన్ను లవ్ స్టోరీస్, ఎమోషనల్ జర్నీస్ సినిమాలతో ఎంకరేజ్ చేశారు. దాంతో కమర్షియల్ ఫార్మేట్‌కు సూట్ అవుతానా అనే సందేహం ఉంటుంది. గతంలో యాక్షన్ ట్రై చేస్తే వర్కవుట్ కాలేదు. కానీ బంగార్రాజు చేశాను. అందులో నా క్యారెక్టర్ హై ఎనర్జిటిక్‌గా ఉంటుంది.
- వెంకట్ ప్రభు దర్శకత్వంలో నేను చేస్తోన్న సినిమాలో నాది పోలీస్ ఆఫీసర్ పాత్ర. నా స్టైల్లో సాగే మాస్ కమర్షియల్ మూవీ అది. సెన్సిబుల్ ఇంటెలిజెంట్ మూవీ.
- మానాడు సినిమా చూడగానే నాకు బాగా నచ్చేసింది. ఆ రైట్స్ అమ్మలేమనో ఏదో ఇష్యూస్ ఉంటాయనడంతో వదిలేశాను. మానాడు ముందు నుంచే వెంకట్ ప్రభుతో ట్రావెల్ అవుతున్నాను. ఇప్పుడు తనతో చేస్తున్న సినిమా మానాడు కంటే ముందుగానే చెప్పాడు. మానాడు రైట్స్ కోసం ట్రై చేశాను. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు రానా తీసుకున్నాడు.
- తరుణ్ భాస్కర్ కూడా మంచి పాయింట్ చెప్పాడు. అది కూడా డిస్కషన్‌లో ఉంది. పరుశురామ్ సినిమా స్టోరి ఇంకా లాక్ కాలేదు. ఓ పాయింట్ అనుకున్నాం.