శాసనసభలో నాగభూషణం మనవడు
Nagabhushanam Grandson: శాసనసభ సినిమాలో నాగభూషణం మనవడు నటించాడు. వైఎస్ఆర్ పాత్రను పోలిన క్యారెక్టర్ ను పోషించాడు.

నాగభూషణం అంటే తెలియని పాతతరం సినీ ప్రేమికుడు అంటూ ఎవ్వరూ ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, కమెడియన్ గా నాగభూషణం తెలుగుతెరపై చెరగని ముద్ర వేశారు. ఇప్పుడీ నటుడి మనవడు టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నాడు.
నాగభూషణం మనవడు, దర్శకుడు మీర్ తనయుడు అబీద్ భూషణ్ నటిస్తున్న తాజా చిత్రం శాసనసభ. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ఇంద్రసేన హీరో. భూషణ్ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు.
పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ రాజకీయ నాయకుడు వైఎస్‌ఆర్‌కు దగ్గరగా ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అబీద్. వైఎస్ఆర్ ఇన్‌స్పిరేషన్‌తో శాసనసభలో ఈ గొప్ప పాత్రను పోషించాడు.
ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ ప్రజలతో కలిసిపోయిన విధానం, ఆయనలోని లీడర్‌షిప్ క్వాలిటీస్ ఈ పాత్రకు ప్రేరణ. తప్పకుండా ఈ పాత్ర తనకు నటుడిగా మంచి పేరు తెస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు అబీద్.