Niharika Chaitanya Divorced: నాగబాబు కూతురు నిహారిక, భర్త చైతన్యకు విడాకులు మంజూరు
Niharika Konidela Chaitanya Jonnalagadda Divorced: సినీ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఐజీ ప్రభాకర్ కొడుకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జొన్నలగడ్డ చైతన్యకు 2020 డిసెంబర్ 9న వివాహం జరిగింది.
Niharika Chaitanya Divorced | మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాలకులు తీసుకుంటున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ ప్రచారం నిజమే అని స్పష్టమైంది. వారిద్దరి పరస్పర అంగీకారం మేరకు కూకట్‌పల్లిలోని రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఈ రోజు ఈ-కోర్ట్స్ వెబ్సైట్లో ప్రత్యక్ష్యం అయ్యాయి.
సినీ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఐజీ ప్రభాకర్ కొడుకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జొన్నలగడ్డ చైతన్యకు 2020 డిసెంబర్ 9న వివాహం జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హిందూ సాంప్రదాయబద్దంగా ఇరు కుటుంబాలు పెళ్లి జరిపించాయి. కొన్నాళ్లు సక్రమంగానే సాగిన వీరిద్దరి కాపురంలో.. క్రమంగా కలహాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. వీరిద్దరినీ కలపడానికి రెండు కుటుంబాల్లోని పెద్దలు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ, అది సాధ్య పడలేదు.
గత కొంత కాలంగా విడివిడిగా ఉంటున్న నిహారిక, చైతన్య సోషల్ మీడియా ఖాతాల్లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకుననారు. అంతే కాకుండా ఆ మధ్య చైతన్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి నిహారికకు సంబంధించిన ఫొటోలన్నింటినీ డిలీట్ చేశాడు. అప్పుడే వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు బయటపడింది. ఆ తర్వాత కొన్నాళ్లకే నిహారిక కూడా చైతన్య ఫొటోలను డిలీట్ చేసింది. మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతీ ఈవెంట్‌కు నిహారిక సింగిల్‌గా రావడంతో వీరి విడాకులకు మరింత బలం చేకూరింది.
ఇన్నాళ్లూ వీరిద్దరి విడాకులపై ఇరు కుటుంబాలు స్పందించలేదు. అయితే మే 19నే కూకట్పల్లి ఫ్యామిలీ కోర్డులో ఇరువురు విడాకుల కోసం అప్లై చేశారు. జూన్‌లోనే పరస్పర అంగీకారం మేరకు కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు తాజాగా వెలుగు చూశాయి. దీంతో మెగా డాటర్ నిహారిక డైవోర్స్ వార్తలు నిజమని స్పష్టమైంది.