Telugu Global
Cinema & Entertainment

నాగచైతన్య పెళ్లి...సమంత ఇంట విషాదం

టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు.

నాగచైతన్య పెళ్లి...సమంత ఇంట విషాదం
X

టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ విషయాన్ని సామ్ తన ఇన్ స్టా ద్వారా వెల్లడించారు. నాన్నను ఇక కలవలేను అని పేర్కొంటు హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు. సమంత చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి, తెలుగు ఆంగ్లో-ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నోసార్లు సామ్ చెప్పుకొచ్చింది. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సామ్ తన తల్లిదండ్రులను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తుండేది. సినీరంగంలో తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా, మద్దతుగా నిలిచారని తెలిపింది. సామ్ తండ్రి మరణవార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నాగ చైత‌న్య‌తో విడాకుల అనంత‌రం స‌మంత ఎదుర్కొన్న గ‌డ్డు ప‌రిస్థితుల్లో త‌న కూతురికి అండ‌గా నిలిచాడు. అలాగే మ‌యోసైటిస్‌తో బాధ‌ప‌డిన‌ప్పుడు కూడా కంటికి రెప్పాల కాపాడుకున్నాడు జోసెఫ్ ప్ర‌భు. మరోవైపు అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆయన పెద్ద కుమారుడు నాగచైతన్య వివాహం శోభితా ధూళిపాళ్ల తో డిసెంబర్‌ 4న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కాబోయే కొత్త జంటకు హల్దీ వేడుకలు నిర్వహించారు

First Published:  29 Nov 2024 5:07 PM IST
Next Story