రేపట్నుంచి సెట్స్ పైకి నాగచైతన్య
వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ రెగ్యులర్ షూటింగ్ రేపట్నుంచి మొదలు కాబోతోంది.
నాగచైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్లో సినిమా ప్రకటన వెలువడినప్పట్నుంచి అక్కినేని అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. నాగచైతన్య కెరీర్ లో 22వ చిత్రంగా, తొలి తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా వస్తోంది ఈ మూవీ. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుకి కూడా ఇది తొలి తెలుగు సినిమా.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇటీవల పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి ఎంపికైంది. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీకొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండడం మరో విశేషం. వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న తొలి ప్రాజెక్టు కూడా ఇదే.
ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపట్నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రానికి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.