Prabhas | కల్కి కష్టాలు మామూలుగా లేవుగా
Prabhas Kalki - ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా మేకింగ్ కోసం ఎంత కష్టపడ్డాడో వివరించాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
ఈ తరం కథలతో సినిమాలు తీయడం ఈజీ. పీరియాడిక్ సినిమాలు తీయడం కాస్త కష్టమైన పని అయినప్పటికీ ట్రై చేస్తున్నారు. కానీ ఫ్యూచర్ కథలతో సినిమాలు తీయడం మాత్రం చాలా కష్టం. అదెంత కష్టమో వివరిస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
ఫ్యూచరిస్టిక్ కథతో కల్కి సినిమాను తీస్తున్నప్పుడు చాలా సవాళ్లు ఎదుర్కొన్నామని తెలిపాడు. తాగే నీరు నుంచి తినే భోజనం వరకు అంతా 500 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో ఊహించుకొని చేయడం చాలా కష్టంగా మారిందన్నాడు. సినిమాలో ఓ బాబుకు పాలు పట్టించే సీన్ ఉందట. ఆ పాల సీసాను డిజైన్ చేయడానికి చాలా రోజులు పట్టిందట. ఓచోట భోజనం చేసే సీన్ ఉందంట. ఆ ఆహారం, ప్లేట్లు డిజైన్ చేయడానికి చాలా టైమ్ పట్టిందంట. చివరికి సినిమాలో పెట్రోల్ బాంబ్స్ కూడా వాడలేదని, 500 ఏళ్ల తర్వాత పెట్రోల్ ఉండదనే ఆలోచనతో కొన్ని కెమికల్ బాంబ్స్ ను క్రియేట్ చేశామని వెల్లడించాడు.
కల్కి సినిమాలో బుజ్జి అనే కారును క్రియేట్ చేయడానికి ఎంత కష్టపడ్డామో, మిగతా ఎలిమెంట్స్ తయారుచేయడానికి కూడా అంతే కష్టపడ్డామని తెలిపాడు నాగ్ అశ్విన్. ఇలా అంతా కొత్తగా ఉండడం వల్ల అమితాబ్, కమల్ హాసన్ లాంటి సీనియర్లు కూడా నటించడానికి చాలా ఆసక్తి చూపించారని, తను చెప్పినట్టు చేశారని చెప్పుకొచ్చాడు