Telugu Global
Cinema & Entertainment

Kalki | లాస్ట్ సిటీగా కాశీ

Kalki Movie - కల్సి సినిమా స్టోరీలైన్ పై రియాక్ట్ అయ్యాడు నాగ్ అశ్విన్. 3 ప్రపంచాల కలయిక కల్కి అంటున్నాడు.

Kalki | లాస్ట్ సిటీగా కాశీ
X

ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘కల్కి’. ఫెంటాస్టిక్ ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎపిక్ జర్నీ ఎపిసోడ్ 1 - ది ప్రిల్యూడ్ ఆఫ్ కల్కి సినిమాపై మరింత క్యురియాసిటీ పెంచింది. ఈ రోజు మేకర్స్ వరల్డ్ ఆఫ్ కల్కి - ప్రిల్యూడ్ ఎపిసోడ్ 2 ని రిలీజ్ చేశారు.

"కాశీ భూమి మీద మొదటి నగరం. అలాంటిది ఈ ప్రపంచంలో కాశీనే ఆఖరి సిటీ అయితే ఎలా ఉంటుందన్న ఐడియాతో కల్కి స్క్రిప్ట్ స్టార్ట్ చేశాం. కలియుగం ఎండింగ్ లో అంతా అయిపోయిన తర్వాత గంగ ఎండిపోయిన తర్వాత లాస్ట్ సిటీ ఏముంటుందని అనుకుంటే, అలాంటి సమయంలో మన కాశీ ఉంటే బాగుంటుందనిపించింది. నాగరికత పుట్టిందే కాశీలో అలాంటి ఆ సిటీని క్రియేట్ చేయడం చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఇండియన్ ఆర్కిటెక్చర్, వెహికిల్స్, కరెన్సీ ఇలా అన్ని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తయారుచేశాం."

ఇలా కాశీ మేకింగ్ పై స్పందించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. "కాశీ పైన పిరమిడ్‌ ఆకారంలో ఉండే స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని మేము కాంప్లెక్స్‌ అంటాం. భూమిపై లేని నేచర్, యానిమల్స్, ఫుడ్, ఇలా ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. ఒకరమైన స్వర్గం అనుకోవచ్చు. కల్కి కథలో మూడో వరల్డ్ కూడా ఉంది. అదే శంబాల. ఇది కల్కి స్టొరీకి ఇంటిగ్రల్ గా ఉంటుంది. కాశీకి కాంప్లెక్స్‌ కి సంబంధం లేని థర్డ్ వరల్డ్. ఈ వరల్డ్ వున్న వారు కాంప్లెక్స్‌ లో ఉన్నవారిని ఛాలెంజ్ చేస్తుంటారు."

కల్కి అవతారం శంబాలా లో పుడుతుందనే నమ్మకం మన పాపులర్ కల్చర్ లో ఉందని, ఈ 3 వరల్డ్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్‌ అవుతూ ‘కల్కి’ కథను నడిపిస్తాయని చెబుతున్నాడు నాగ్ అశ్విన్.

First Published:  20 Jun 2024 10:57 PM IST
Next Story