Kanguva | 'మైత్రీ' చేతికి మరో ప్రతిష్టాత్మక చిత్రం
Kanguva - కంగువా సినిమా మైత్రీ చేతిలో పడింది. నైజాంలో సూర్య సినిమాకు మంచి రిలీజ్ దక్కబోతోంది.

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. అక్టోబర్ 10న దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ గా విడుదలకానుంది. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతోంది.
ఇటీవల పలు సూపర్ హిట్ చిత్రాలను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ప్రెస్టీజియస్ మువీ 'కంగువ'ను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నాడు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
10 భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.