Telugu Global
Cinema & Entertainment

Varun Sandesh | మైత్రీ చేతికి వరుణ్ సందేశ్ మూవీ

Varun Sandesh - వరుణ్ సందేశ్ తాజా చిత్రం విరాజి. ఈ సినిమాను మైత్రీ సంస్థ రిలీజ్ చేయబోతోంది.

Varun Sandesh | మైత్రీ చేతికి వరుణ్ సందేశ్ మూవీ
X

మహా మూవీస్, ఎమ్ 3 మీడియా బ్యానర్ పై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం "విరాజి". ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధం అయింది. ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన మైత్రీ సంస్థ, కంటెంట్ నచ్చడంతో విడుదలకు ముందుకొచ్చింది.

ఇటీవలే విడుదల అయిన విరాజి టీజర్ కి మంచి స్పందన లభించింది. ఈ చిత్రం వరుణ్ సందేశ్ కెరీర్ లో పెద్ద విజయం సాధిస్తుందని అంటున్నాడు నిర్మాత మహేంద్ర.. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. వరుణ్ సందేశ్ చాలా కొత్తగా ఉంటాడు. ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా మైత్రి మూవీస్ సంస్థ ద్వారా విడుదల కానుంది.

నిజానికి ఈ సినిమా కంటే ముందు వరుణ్ సందేశ్ నటించిన కానిస్టేబుల్ అనే మూవీ విడుదల కావాల్సి ఉంది. కానీ దానికంటే ముందు విరాజిని విడుదల చేయాలని నిర్ణయించారు. రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఎబినేజర్ పాల్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  15 July 2024 4:48 PM GMT
Next Story