Prabhas Marriage: తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా..!
Prabhas Marriage: తను పెళ్లంటూ చేసుకుంటే, తిరుపతిలోనే చేసుకుంటానని ప్రకటించాడు ప్రభాస్.
తన పెళ్లికి సంబంధించి మరోసారి స్పందించాడు హీరో ప్రభాస్. తను పెళ్లి చేసుకుంటే తిరుపతిలోనే చేసుకుంటానని ప్రకటించాడు. ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ వేడుకలో ఈ ప్రకటన చేశాడు ప్రభాస్.
తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ రాత్రి గ్రాండ్ గా జరిగింది. ప్రభాస్ మైక్ అందుకోగానే, కింద ఉన్న ఫ్యాన్స్, పెళ్లి...పెళ్లి అంటూ అరవడం మొదలుపెట్టారు. దీనిపై స్పందించిన ప్రభాస్, "తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటాను, ఓకేనా" అంటూ రియాక్ట్ అయ్యాడు.
ఇకపై తన నుంచి ఏడాదికి 2 సినిమాలు వస్తాయని ప్రకటించాడు ప్రభాస్. ఒక్కో ఏడాది మూడు చిత్రాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపాడు. అయితే రిలీజెస్ లేట్ అయితే తనకు సంబంధం లేదని స్పష్టం చేశాడు.
ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు ప్రభాస్. ఇదే ఏడాది సలార్ సినిమాను కూడా ప్రేక్షకు ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రాజెక్ట్-కె సినిమాను, అదే ఏడాది మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమాను తీసుకురాబోతున్నాడు. ఇలా ప్రతి ఏటా తన నుంచి కచ్చితంగా 2 సినిమాలుంటాయని ప్రకటించాడు ఈ హీరో.