Telugu Global
Cinema & Entertainment

నా అనారోగ్యం వార్తలు నిజమే

నా ఆరోగ్య సమస్య గురించి మొదటిసారి తెలిసి ఎంతో బాధపడ్డా.అనారోగ్యానికి సంబంధించి ఇప్పటికే నాలుగు సెషన్ల ట్రీట్‌మెంట్‌ పూర్తయ్యిందన్న కన్నడ స్టార్‌

నా అనారోగ్యం వార్తలు నిజమే
X

కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ ఆరోగ్యంపై కొన్నిరోజులు వస్తున్న వార్తలపై మౌనం వీడారు. కొంతకాలంగా సోషల్‌ మీడియాలో తన అనారోగ్యంపై వస్తున్న వార్తలకు ఆయన చెక్‌పెట్టారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పారు. దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. నా ఆరోగ్య సమస్య గురించి మొదటిసారి తెలిసి ఎంతో బాధపడ్డాను. అభిమానులు, ప్రజలు ఆందోళన చెందడం నాకు ఇష్టం లేదు. దాన్ని ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసాన్ని పొందాను. ఇప్పుడు బాగానే ఉందని, అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నేను అబద్ధం చెప్పను. నేను కూడా మనిషినే కదా. నాకు సమస్యలు వస్తుంటాయి. నాకు వచ్చిన అనారోగ్యానికి సంబంధించి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పటికే నాలుగు సెషన్ల ట్రీట్‌మెంట్‌ పూర్తయ్యిందని తెలిపారు.

మరోవైపు అనారోగ్య సమస్యల వల్ల తాను ఒప్పకున్న సినిమాలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని భావిస్తున్నట్లు చెప్పారు. కొత్త సినిమాల షూటింగ్స్‌తో పాటు, రిలీజ్‌కు సిద్ధమైన వాటి ప్రమోషన్‌ కార్యక్రమాల్లో నిర్విరామంగా పాల్గొంటున్నట్లు తెలిపారు. శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత నెలరోజుల పాటు రెస్ట్‌ తీసుకోనున్నట్లు చెప్పారు. తాను ఇప్పటికే కమిట్‌ అయిన సినిమాల డైరెక్టర్లు, నిర్మాతలకు ఈ వషక్ష్మీం తెలుసని, అందుకు తగినట్లు షెడ్యూల్స్‌ సిద్ధం చేసుకున్నారని వివరించారు. రాబోయే రెండు నెలల్లో అన్నీ సర్దుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శివరాజ్‌కుమార్‌ ప్రస్తుతం తన న్యూ మూవీ 'భైరతి రంగల్‌' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇక ఇతర సినిమాల విషయానికి వస్తే ఉత్తరకాండ, 45, రామ్‌చరణ్‌-బుచ్చిబాబు, భైరవుడు సినిమాల్లో నటిస్తున్నారు.

First Published:  8 Nov 2024 7:00 PM IST
Next Story