Telugu Global
Cinema & Entertainment

Murugadas | మురుగదాస్ నయా సెంటిమెంట్

Murugadas - సినీ పరిశ్రమల్లో సెంటిమెంట్ కు కొదవలేదు. ఇప్పుడు మురుగదాస్ కూడా ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు.

Murugadas | మురుగదాస్ నయా సెంటిమెంట్
X

సినీ పరిశ్రమల్లో సెంటిమెంట్ కు కొదవలేదు. ఇప్పుడు మురుగదాస్ కూడా ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. తుపాకీతో తిరుగులేని హిట్ అందుకున్న ఈ దర్శకుడు, సెంటిమెంట్ కొద్దీ అందులో విలన్ గా నటించిన నటుడ్ని, తన కొత్త సినిమాలోకి కూడా తీసుకున్నాడు.

శివకార్తికేయన్ హీరోగా, శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా తెరకెక్కుతోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకుడు.

తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలోకి విద్యుత్‌ జమ్వాల్‌ ను తీసుకున్నారు. సినిమాలో పవర్ ఫుల్ విలన్ రోల్ లో అతడు కనిపించబోతున్నాడు.

ఇంతకుముందు మురుగదాస్ తీసిన తుపాకీ సినిమాలో విద్యుత్ జమ్వాల్ విలన్ గా నటించాడు. ఆ సెంటిమెంట్ కొద్దీ, శివకార్తికేయన్ సినిమా కోసం కూడా అతడ్నే రిపీట్ చేస్తున్నాడు మురగదాస్. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో విద్యుత్‌ జమ్వాల్‌ జాయిన్ అయ్యాడు.

వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్స్ అందిస్తున్న హీరో శివకార్తికేయన్ కెరీర్‌లో ఇది భారీ బడ్జెట్ సినిమా. కన్నడ నటి, సప్తసాగరాలు దాటి సినిమా ఫేమ్ రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

First Published:  9 Jun 2024 4:28 PM GMT
Next Story