Telugu Global
Cinema & Entertainment

Mrunal Thakur | మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన మృణాల్

Mrunal Thakur - ఓ వైపు తెలుగులో క్రేజ్ కొనసాగిస్తూనే, మరోవైపు హిందీలో కూడా సినిమాలు అంగీకరిస్తోంది మృణాల్ ఠాకూర్.

Mrunal Thakur | మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన మృణాల్
X

అదృష్టం పట్టుకుంటే అంతే. వద్దంటే అవకాశాలు. విపరీతమైన క్రేజ్, అదే స్థాయిలో డబ్బు. ప్రస్తుతం ఈ స్టేజ్ ను ఎంజాయ్ చేస్తోంది మృణాల్ ఠాకూర్. తెలుగులో సీతారామం సినిమా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, అదే టైమ్ లో బాలీవుడ్ లో కూడా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

దీంతో ఆమెకు రెండు భాషల నుంచి వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో సినిమాలు చేస్తూనే, హిందీలో కూడా నటిస్తోంది మృణాల్. ఈ క్రమంలో మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. వరుణ్ ధావన్ నటిస్తున్న కొత్త సినిమా కోసం మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నారు. అగ్రిమెంట్ కూడా పూర్తయింది. నవంబర్‌లో ఆమె షూట్‌లో జాయిన్ అవ్వాలి.

వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మృణాల్ ఠాకూర్, వరుణ్ ధావన్ ది ఫ్రెష్ కాంబినేషన్. రీసెంట్ గా తెలుగులో కల్కి సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది మృణాల్. అంతకంటే ముందు ఆమె ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేసింది.

ప్రస్తుతం ఆమెకు తెలుగు నుంచి పెద్ద సినిమా ఆఫర్లు వస్తున్నాయి. అయినప్పటికీ తెలుగుతో పాటు, హిందీ సినిమాలు కూడా చేయాలని ఆమె నిర్ణయించుకుంది. అందుకే వరుణ్ ధావన్ మూవీకి ఓకే చెప్పింది.

First Published:  23 July 2024 5:06 PM GMT
Next Story