సీతారామంలో అవకాశం అలా వచ్చింది
సీతారామం సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాతో టాలీవుడ్ లో జెండా పాతేస్తానంటోంది.
హీరోయిన్ గా అవకాశం సంపాదించడం కాస్త కష్టమైన పనే. పెద్ద బ్యానర్ లో, ఓ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా అవకాశం సంపాదించడం ఇంకా కష్టమైన పని. అలా తొలి తెలుగు డెబ్యూ మూవీతోనే పెద్ద సినిమా ఛాన్స్ అందుకుంది మృణాల్ ఠాకూర్. మరి అదే సీతారామం. మరి ఈ సినిమా ఛాన్స్, ఈ ముద్దుగుమ్మను ఎలా వరించింది.
"హిందీ జర్సీ రీమేక్ షూటింగ్ జరుగుతుండగా నేను చంఢీగర్ లో ఉన్నాను. హను రాఘవపూడి ఫోన్ చేసి ఒకసారి కలవాలన్నారు. అలా ముంబైలో కాఫీషాప్ లో కలిశాం. ఆ తర్వాత పూర్తి కథను ఆఫీసులో విన్నా. ఆయన నెరేషన్ చేసే విధానం నా ఎగ్జైట్‌మెంట్ చూసి వెంటనే ఫిక్స్ చేశారు."
ఇలా తనకు అవకాశం వరించిన విధానాన్ని వివరించింది మృణాల్. ఈ సినిమా అవకాశం రావడం కంటే ముందే తనకు నాగ్ అశ్విన్ తెలుసని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఈమె తొలి సినిమా లవ్ సోనియా. ఈ సినిమాను మెల్ బోర్న్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అదే ఫిలింఫెస్టివల్ కు మహానటి సినిమాతో నాగ్ అశ్విన్ కూడా వచ్చాడు. ఆ టైమ్ లో నాగ్ అశ్విన్ తో పరిచయం ఏర్పడిందని చెప్పుకొచ్చింది మృణాల్.
భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాలు చేస్తానంటున్న ఈ బ్యూటీ.. నటించడానికి స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే చేయాలనుకుంటున్నట్టు స్పష్టం చేసింది.