Telugu Global
Cinema & Entertainment

అలాంటి వాటికి ప్రిపేర్ అయ్యే ఇండస్ట్రీకొచ్చాను - హీరోయిన్ మృణాల్

హీరోయిన్ గా కెరీర్ ఎన్నుకునే వాళ్లు కొన్ని అంశాల పట్ల మానసికంగా సన్నద్ధమై ఉండాలంటోంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్.

Mrunal Thakur
X

హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టాలని అనుకున్నప్పుడు కొన్నింటికి మానసికంగా సిద్ధమవ్వాలని అంటోంది హీరోయిన్ మృణాల్. మరీ ముఖ్యంగా నిద్రలేమి, కష్టపడి పనిచేయడం, ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోవడం లాంటి విషయాలపై ముందుగానే అవగాహన పెంచుకోవాలని, వాటికి అనుగుణంగా పనిచేయాలని అంటోంది. ఇలాంటి వాటికి మెంటల్లీ ప్రిపేర్ అయిన తర్వాతే తను గ్లామర్ ఫీల్డ్ లోకి వచ్చానంటోంది.

"సీతారామం సినిమా కోసం ర‌ష్యా, క‌శ్మీర్‌, స్విట్జ‌ర్లాండ్‌లో మైన‌స్ డిగ్రీలో షూటింగ్ చేయాల్సి వ‌చ్చింది. స్ట‌డీ కామ్ తో షూట్ చేస్తుండ‌గా దుల్క‌ర్, ద‌ర్శ‌కుడు కూడా ప‌రుగెడుతూ చేశారు. నేను కూడా పరుగెత్తుతూ చేశాను. అవ‌స‌ర‌మైతే ఇంకా చేస్తాన‌ని అని అడిగాను. ఒక ద‌శ‌లో డాన్స్‌లో ఓ ముద్ర చేయాల్సి వ‌చ్చింది. అంత చ‌లిలోనూ నేను చేయ‌గ‌లిగాను అంటే న‌టిగా చేయాలి కాబ‌ట్టి చేశాను. అందుకు నేను ప్రిపేర్ అయ్యాను."

ఇలా హీరోయిన్ గా తనకు ఎదురైన కష్టాల గురించి బయటపెట్టింది మృణాల్. సీరియల్స్ లో నటిస్తున్న టైమ్ లోనే తను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, వాటిని అధిగమిస్తూ, మరోవైపు అందాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైన పని అంటోంది ఈ బ్యూటీ.

దుల్కర్ హీరోగా నటించిన సీతారామం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా సక్సెస్ కోసం ఆమె ఆత్రుతగా ఎదురుచూస్తోంది. సీతారామం రిజల్ట్ చూసి తెలుగులో మరిన్ని సినిమాలకు కమిట్ అవ్వాలని ఆమె అనుకుంటోంది.

First Published:  3 Aug 2022 10:00 AM IST
Next Story