Telugu Global
Cinema & Entertainment

Mr Bachchan | సక్సెస్ సెలబ్రేషన్స్ తర్వాత ట్రిమ్మింగ్

Mr Bachchan - రవితేజ హీరోగా నటించిన సినిమా మిస్టర్ బచ్చన్. సినిమా నెగెటివ్ టాక్ ను దృష్టిలో పెట్టుకొని 13 నిమిషాలు ట్రిమ్ చేశారు.

Mr Bachchan | సక్సెస్ సెలబ్రేషన్స్ తర్వాత ట్రిమ్మింగ్
X

మిస్టర్ బచ్చన్ సినిమా సూపర్ హిట్టయిందంటూ యూనిట్ సక్సెస్ సంబరాలు చేసుకుంది. కేక్ కట్ చేసి, ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. ఆఫీస్ ముందు బాణసంచా కాల్చి హంగామా చేశారు. రవితేజ ఎక్కడో ఉంటే, హీరోయిన్ ను వెంటేసుకొని అతడ్ని ప్రత్యేకంగా కలిసి ఫొటోలు దిగి, కౌగిలించుకొని వచ్చారు.

ఇంత చేసిన తర్వాత రెండో రోజుకు మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి కొన్ని సన్నివేశాల్ని కట్ చేశారు. అన్ని రకాల విమర్శలు, ఫీడ్ బ్యాక్ ఆధారంగా మిస్టర్ బచ్చన్ సినిమాను 13 నిమిషాలు కట్ చేస్తున్నామంటూ ప్రకటించారు. మరోసారి థియేటర్ కొచ్చి సినిమా చూడమని అడుగుతున్నారు.

మేకర్స్ చేసిన ఈ పనితో సరికొత్త ట్రోలింగ్ మొదలైంది. సక్సెస్ సంబరాలు చేసిన సినిమాకి ట్రిమ్మింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ గోల చేస్తున్నారు సోషల్ మీడియా జనం. ట్రిమ్ చేయాల్సింది 13 నిమిషాలు కాదని, ఓ గంట కట్ చేస్తే బాగుండేదంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇప్పటికే మిస్టర్ బచ్చన్ సినిమాకు జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ గా ట్రిమ్ చేసి బావుకునేది ఏం లేదని మరికొందరు కామెంట్ చేయగా.. ఇకపై హరీశ్ శంకర్ తో సినిమాలు తీయొద్దంటూ మరో నెటిజన్, పీపుల్ మీడియాకు సూచించాడు.

అంతా ఓకే కానీ, ఓ సాంగ్ లో హీరోయిన్ ప్యాంట్ లో ముందు నుంచి చేయి పెడతాడు హీరో. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆ సీన్ ఉంచారా లేక కట్ చేశారా..!

First Published:  17 Aug 2024 10:12 PM IST
Next Story