Telugu Global
MOVIE REVIEWS

ఓటీటీలోకి 'సరిపోదా శనివారం'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఆగస్టు 29న గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ మూవీ ఓటీటీలోనూ అలరించడానికి సిద్ధమైంది.

ఓటీటీలోకి సరిపోదా శనివారం.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
X

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ డైరెక్షన్‌లో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'సరిపోదా శనివారం' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సెప్టెంబర్‌ 26 నుంచి ప్రసారం కానున్నది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నది.

నాని హీరోగా, ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా, ఎస్‌జే సూర్య పవర్‌ఫుల్‌ రోల్‌లో నటించిన ఈ మూవీని డీవీపీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీపీ దానయ్య, కల్యాణ్‌ దాసరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆగస్టు 29న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో అద్భుత విజయాన్ని అందుకొని రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే.

కథ ఏమిటంటే?

చిన్నప్పటి నుంచి సూర్య (నాని)కు కోపం ఎక్కువ. దాన్నిఅదుపులో పెట్టడానికి తన తల్లి చాయాదేవీ (అభిరామి) మాట తీసుకుంటుంది. ఆ మాట ప్రకారం వారమంతా ఎంత కోపం వచ్చినా నియంత్రించుకుని శనివారం మాత్రమే తన కోపానికి కారణమైన వాళ్ల పని పడుతుంటాడు. ఆ గొడవలతో తండ్రి (సాయికుమార్‌), అక్క (అదితి) ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్‌.ఎల్‌.ఐ.సిలో మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకున్న సూర్య చిట్టాలోకి సీఐ దయానంద్‌ (ఎస్‌జే సూర్య) చేరుతాడు. తన సొంత అన్న కూర్మానంద్‌ (మురళీశర్మ)తోనే వైరం ఉన్న సీఐ దయానంద్‌ కథ ఏమిటి? అతనికీ, సోకులపాలెం అనే ఊరికి సంబంధం ఏమిటి? దయానంద్‌పై సూర్య కు ఉన్న కోపం, సోకులపాలానికి ఎలా మేలు జరిగింది? వీళ్ల కథలోకి చారులత (ప్రియాంక మోహన్‌) ఎలా వచ్చింది అన్నది చిత్ర కథ!

First Published:  21 Sept 2024 11:49 AM IST
Next Story