Telugu Global
MOVIE REVIEWS

రాహుల్‌ జీ.. మీ మంత్రులను కట్టడి చేయండి

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన అక్కినేని అమల

రాహుల్‌ జీ.. మీ మంత్రులను కట్టడి చేయండి
X

రాహుల్‌ గాంధీ జీ.. మీకు మానవత్వం ఉంటే మీ మంత్రులు కట్టడి చేయాలని అక్కినేని అమల డిమాండ్‌ చేశారు. మంత్రి కొండా సురేఖ తమ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తన కుటుంబంపై మహిళా మంత్రి కొండా సురేఖ అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తమ కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. తన భర్తను ఉద్దేశించి మహిళా ఆరోపణలు నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గు చేటు అన్నారు. ఇలాంటి నాయకులను కట్టడి చేయాలని రాహుల్‌ గాంధీని కోరారు అమల. మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌ పై సినీ ప్రముఖులు అక్కినేని కుటుంబంతో పాటు సమంతకు బాసటగా నిలుస్తున్నారు. ఏపీ మాజీ మంత్రి, సినీ నటి రోజా, రచయిత, దర్శకుడు కోన వెంకట్‌, దర్శకుడు వేణు ఊడుగుల తదితరులు స్పందించారు. మంత్రి అక్కినేని కుటుంబంతో పాటు సమంతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.





First Published:  2 Oct 2024 10:18 PM IST
Next Story