చంద్రబాబుతో మోహన్ బాబు, మంచు విష్ణు భేటీ
వరద బాధితులకు రూ.25 లక్షల సాయం అందజేత
BY Naveen Kamera28 Sept 2024 6:25 PM IST
X
Naveen Kamera Updated On: 28 Sept 2024 6:25 PM IST
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సీనియర్ నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ అయ్యారు. శనివారం తాము చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశామని మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వరద బాధితుల సహాయార్థం రూ.25 లక్షల చెక్కు అందజేశామని వెల్లడించారు. సీఎంను కలవడం చాలా సంతోషంగా ఉందని, తమ అప్ కమింగ్ ప్రాజెక్టు 'కన్నప్ప'తో పాటు పలు విషయాలపై చర్చించామన్నారు. తాను వేసిన ఆర్ట్ వర్క్ పై చంద్రబాబు సంతకం తీసుకున్నానని తెలిపారు.
Next Story