'దేవర' మూవీ రివ్యూ
టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆరేళ్ల తర్వాత సింగిల్ హీరోగా వచ్చిన మూవీ దేవర. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్‌తో దూసుకుపోతోంది.
టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆరేళ్ల తర్వాత సింగిల్ హీరోగా వచ్చిన మూవీ దేవర. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమా చూసిన వారంతా అదిరిపోయింది అని అంటూనే సెకండాఫ్‌లో ఏదో మిస్ అయ్యిందని అంటున్నారు. ఓవరాల్‌గా ఫస్ట్ హాస్ సూపర్‌గా ఉందని, అందులోనూ ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచినట్లు చెబుతున్నారు సినీ లవర్స్. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ అరాచకం అంటున్నారు. ఇక సెకండాఫ్‌కు వచ్చే సరికి కథ తేలిపోయిందని అంటున్నారు సినీ ప్రేమికులు. ఇక రికార్డులు బద్దలు కొట్టడానికి వచ్చేసిన దేవర మూవీ రివ్యూ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
ఆరేళ్ల తర్వాత అది కూడా ట్రిబుల్ ఆర్ లాంటి సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ దేవర. ఇప్పటి వరకూ రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలకు ఆ తర్వాత చేసే సినిమా డిజాస్టర్‌గా నిలుస్తుందనే టాక్ ఉంది. కానీ అది దేవర మూవీకి వర్తించలేదని తెలుస్తోంది. ఎందుకంటే దేవర మూవీ అరాచకంగా ఉంది. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. దేవరలో తారక్ యాక్టింగ్ అదుర్స్. ఫస్ట్ హాఫ్ మొత్తం వీరలెవల్లో ఎంటర్టైన్ చేస్తుంది. కొన్ని కొన్ని సీన్స్ చూస్తే గూస్‌బమ్స్ రాకమానదు. సినిమా మొత్తానికి ఎన్టీఆర్ హైలెట్‌గా యాక్టింగ్ చేశారు. దేవర ఎంట్రీ సీన్ అయితే ఫ్యాన్స్ బట్టలు చించుకునేలా ఉంది.
అనిరుద్ రవిచందర్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ గూస్ బమ్స్ వచ్చేలా ఉన్నాయి. సినిమా రిలీజ్‌కు ముందు పాటల గురించి నెగిటివ్ టాక్ వచ్చింది. మ్యూజిక్ కూడా సరిపోలేదని అన్నారు. కానీ స్టోరీ పరంగా చూస్తే అనిరుధ్ మ్యూజిక్ వేరే లెవల్లో ఉంది. ఇక స్టోరీ పరంగా కొరటాల శివ అదరగొట్టాడు. షార్క్ ఫైటింగ్ సీన్, విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. యాక్షన్ సీన్లు తెరకెక్కించిన విధానం అయితే నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి. సినిమా స్టార్టింగ్, ఇంట్లో సీన్లు, ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్టులు వీర లెవల్లో ఉన్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అయితే కాలర్ ఎగరేసుకునేలా ఉన్నాయని చెప్పాలి.
కథ విషయానికి వస్తే.. ఎర్రసముద్రంలో దేవర మాటే శాసనంగా ఉంటుంది. నాలుగు ఊళ్ళకు పెద్ద దిక్కుగా దేవర ఉంటాడు. వాళ్లకు సముద్రమే జీవనాధారంగా ఉంటుంది. ఆ సముద్రం నుంచి కొన్ని సరుకులను కోస్ట్ గార్డ్‌కు తెలియకుండా దించుతూ ఉంటారు. అదే ఊళ్ళో భైర కూడా ఉంటాడు. బైరాకు దేవర అంటే నచ్చదు. అయితే కొన్నేళ్ల తర్వాత దేవర ఊరికి దూరం అవుతాడు. దేవర కొడుకు వర ఓ పిరికివాడు. అలాంటి పిరికివాడు ఎందుకు భయపడుతుంటాడు? ఊరి సమస్యలను ఎవరు తీరుస్తుంటారు? ఇంతకీ దేవర బతికి ఉంటాడా? చనిపోతాడా? ఇవన్నీ తెలియాలంటే స్క్రీన్‌పై సినిమా చూడాల్సిందే.
ఇక దేవరకు పాజిటివ్ టాక్‌తో పాటుగా కొంత నెగిటివ్ టాక్ వస్తోంది. కొంతమంది సినిమా ఏం బాగోలేదని, రొటిన్ సినిమా చూసినట్టుగానే ఉందని అంటున్నారు. మ్యూజిక్, ఎన్టీర్ యాక్టింగ్ మినహా చెప్పుకోతగ్గవి ఏవీ కనిపించలేదని అంటున్నారు. ఆచార్య2లా ఉందని కొందరు అంటుంటే, సెకండాఫ్ ల్యాగ్ ఎక్కువగా ఉందని, అక్కడక్కడ బోరింగ్ సీన్స్ ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్ తర్వాత జాన్వీ కపూర్‌తో చేసే సీన్స్ ఆడియన్స్‌కు బోర్ కొట్టించాయట. సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని అంటున్నారు. విలన్‌గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఆకట్టుకోలేకపోయారని, ఆయనకు డబ్బింగ్ సెట్ కాలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సెకండాఫ్‌లో కథను డీల్ చేయడంలో కొరటాల తడపడ్డారని, అసలు సినిమాను రెండు భాగాలుగా ఎందుకు తెరకెక్కించారో ఎవరికి అర్థం కావడం లేదని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.