Telugu Global
MOVIE REVIEWS

డివోర్స్ పుకార్లపై ఐశ్వర్యా చెక్‌..ఏమి చేశారంటే?

బాలీవుడ్ జోడీ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ డివోర్స్ తీసుకుంటున్నారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజగా పారిస్ ఫ్యాషన్ వీక్‌కు ఐశ్వర్యారాయ్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి హాజరయ్యారు.

డివోర్స్ పుకార్లపై ఐశ్వర్యా చెక్‌..ఏమి చేశారంటే?
X

బాలీవుడ్ జంట అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యా రాయ్‌ డివోర్స్ తీసుకుంటున్నారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజగా పారిస్ ఫ్యాషన్ వీక్‌కు ఐశ్వర్యారాయ్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి హాజరయ్యారు. ఆమె చేతి వేలికి వెడ్డింగ్ రింగ్ ఉండడంతో విడాకుల రూమర్స్ ఆమె ముగింపు పలికింది. అయితే, అభిషేక్ , ఐశ్వర్యా ఎప్పటికప్పుడు పరోక్షంగా ఖండిస్తూనే ఉన్నప్పటికీ, పుకార్లకు మాత్రం అడ్డుకట్ట పడడంలేదు. వారిద్దరూ కలిసి పబ్లిక్ గా కనిపిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతూనే ఉంది.

తాజాగా, ఐశ్వర్యారాయ్ మరోసారి తనదైన శైలిలో విడాకుల పుకార్లపై స్పందించారు. ఈసారి చేతి వేలికి పెళ్లి నాటి ఉంగరం ధరించి ఫొటో సెషన్ కు హాజరయ్యారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న పారిస్ ఫ్యాషన్ వీక్ కు ఐశ్వర్యారాయ్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి హాజరయ్యారు. ఆమె చేతి వేలికి వెడ్డింగ్ రింగ్ ఉండడంతో విడాకుల ఊహాగానాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది. మరోవైపు, ఐశ్వర్యా సోషల్ మీడియా ఖాతాను అమితాబ్‌ అన్‌ఫాలో చేశారంటూ బాలీవుడ్‌ మీడియాలో రూమర్స్ వచ్చాయి.

First Published:  23 Sept 2024 9:28 PM IST
Next Story