Telugu Global
MOVIE REVIEWS

Agent Review: ఏజెంట్ మూవీ రివ్యూ {2/5}

Agent Movie Review, ఏజెంట్ మూవీ రివ్యూ: అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ఎక్స్ క్లూజివ్ రివ్యూ..

Agent Movie Review in Telugu
X

Agent Movie Review in Telugu: ఏజెంట్ మూవీ రివ్యూ {2/5}

చిత్రం: ఏజెంట్

తారాగణం: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్ముట్టి

దర్శకత్వం: సురేందర్ రెడ్డి

నిర్మాత: అనీల్ సుంకర, సురేందర్ రెడ్డి

బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా

కథ: వక్కంతం వంశీ

సంగీతం: హిప్ హాప్ తమిళా

డీవోపీ: రసూల్ ఎల్లోర్

ఎడిటర్: నవీన్ నూలి

రేటింగ్: 2/5

కథలు కొత్తగా రావు, ఉన్న కథల్నే కొత్తగా చెప్పాలి. తాజాగా హిట్టయిన విరూపాక్ష సినిమా ఆ కోవకు చెందిందే. దసరా కూడా అలాంటి మూవీనే. ఈరోజు రిలీజైన ఏజెంట్ కథ కూడా కొత్తదేం కాదు. కానీ కొత్తగా చెప్పలేకపోయారు. అక్కడే వచ్చింది సమస్య.

దర్శకుడు సురేందర్ రెడ్డి మంచి క్యారెక్టరైజేషన్ అనుకున్నాడు కానీ కథ అనుకోలేదు. అందులో తప్పులేదు కూడా. కానీ కథ లేకపోయినా, సదరు క్యారెక్టరైజేషన్ చుట్టూ మంచి కథనం అల్లుకోవాలి కదా. గ్రిప్పింగ్ నెరేషన్ ఉండాలి కదా. ఆ ప్రయత్నం చేయలేదు. ఎంతసేపూ హీరో వైల్డ్ గా ఉండాలనే తపనతో బేసిక్ లాజిక్ ను గాలికొదిలేశాడు. అలా అని హీరో నిజంగానే వైల్డ్ గా ఉన్నాడంటే అది కూడా లేదు. ఫస్టాఫ్ లో వైల్డ్ సాలా కనిపించిన హీరో, సెకండాఫ్ కు వచ్చేసరికి సగటు తెలుగు హీరోగా మారిపోతాడు. ఎక్కడా వైల్డ్ నెస్ కనిపించలేదు.

కథ విషయానికొస్తే.. చీఫ్ మహాదేవ్ (మమ్ముట్టి) పని విషయంలో మొండిగా ఉంటాడు, ఎలాంటి సెంటిమెంట్స్ పట్టించుకోడు. అందుకే అతడ్ని అంతా డెవిల్ అంటారు. అతడి దగ్గర ట్రయినింగ్ తీసుకున్న గాడ్ (డినో మోరియో) ది బెస్ట్ ఏజెంట్ గా ఎదుగుతాడు. కానీ సెంటిమెంట్ విషయంలో చీఫ్ తో గొడవ జరుగుతుంది. దీంతో డెవిల్ కు వ్యతిరేకంగా సిండికేట్ కు లీడర్ గా ఎదుగుతాడు. గాడ్ ను ఎదుర్కొనేందుకు రామకృష్ణ (అఖిల్)ను తన గ్రూప్ లోకి తీసుకుంటాడు డెవిల్. ఎన్నోసార్లు ఏజెంట్ అవ్వడానికి ప్రయత్నించి విఫలమౌతాడు రామకృష్ణ. అయితే అతడిలో ఓ వైల్డ్ నెస్ ఉంటుంది. దాన్ని నమ్మి, ఓ అవకాశం ఇస్తాడు డెవిల్. ఇంతకీ రామకృష్ణ ఎందుకు ఏజెంట్ అవ్వాలనుకున్నాడు? అతడి అసలు లక్ష్యం ఏంటి? డెవిల్-గాడ్ మధ్య జరిగిన పోరులో ఎవరు గెలిచారు? అనేది బ్యాలెన్స్ స్టోరీ.

కథను బాగానే స్టార్ట్ చేశాడు దర్శకుడు. హీరో లాంఛింగ్ కూడా గ్రాండ్ గా ఉంది. హీరోయిన్ ఎంట్రీ కూడా అదిరింది. పాత్రల పరిచయం కూడా చకచకా సాగింది. ఈ క్రమంలో వచ్చిన ఓ సన్నివేశం ఫస్టాఫ్ కే హైలెట్ గా నిలుస్తుంది. హీరోయిన్ ను, విలన్ ఇంటికి తీసుకొచ్చి అతడికి వార్నింగ్ ఇచ్చే ఎపిసోడ్ చాలా బాగుంది. ఆ వెంటనే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదిరింది. ఆడియన్స్ ఒకటి ఊహిస్తే, హీరో మరోలా రియాక్ట్ అవుతాడు.

అలా వైల్డ్ గా ఆలోచించి, అంతే వైల్డ్ గా ఇంటర్వెల్ కార్డ్ వేసిన దర్శకుడు.. సెకండాఫ్ లో మాత్రం ఆ వైల్డ్ ఆలోచనల్ని చూపించలేకపోయాడు. దాని స్థానంలో 'దేశం కోసం' అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది. దీంతో అంతా రొటీన్ అయిపోతుంది. విలన్ ను చేరడానికి హీరో సాగించే ప్రయాణం ఆసక్తికరంగా ఉంటే బాగుండేది. దీనికితోడు పాత్రల మధ్య పొంతన లేదు, ఎమోషన్ కుదరలేదు.

ఉన్నంతలో ఈ సినిమాను ఆదుకున్న ఎలిమెంట్ అఖిల్. సిక్స్ ప్యాక్ లో అఖిల్ బాగున్నాడు, వైల్డ్ సాలాగా అతడి యాక్టింగ్ కూడా బాగుంది. కానీ సినిమాలో సరైన సన్నివేశాలు పడక, అతడి ప్రయత్నం వృధా అయింది. యాక్షన్ సన్నివేశాల్లో బాగా చేశాడు అఖిల్. హీరోయిన్ సాక్షి వైద్య పాత్రను ఎడిటింగ్ లో లేపేశారు. ఫస్టాఫ్ లో లవ్ ట్రాక్ కోసం వాడుకొని, సెకండాఫ్ లో ఓ సీన్ తో సరిపెట్టి ఇంటికి పంపించారు. మమ్ముట్టి, డినో మారియో తమ పాత్రలకు న్యాయం చేయగా.. మిగతా పాత్రలన్నీ ఇలా వచ్చి అలా వెళ్లేవే.

టెక్నికల్ గా సినిమా బాగున్నప్పటికీ పూర్తిస్థాయి అవుట్ పుట్ మాత్రం రాలేదు. సినిమాటోగ్రఫీ బాగున్నప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల మేజిక్ మిస్సయింది. కొన్ని చోట్ల ఈ రెండూ బాగుంటే, ఎడిటింగ్ మిస్ పైర్ అయింది. ఇలా టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ మధ్య సింక్ లేకపోవడం సినిమాకు ఇబ్బందికరంగా మారింది. పాటల్ని స్కిప్ కొట్టొచ్చు.

ఓవరాల్ గా అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమాను యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఓసారి చూడొచ్చు. అంతకుమించి ఆశిస్తే మాత్రం ఆశాభంగం తప్పదు.

First Published:  28 April 2023 7:19 AM GMT
Next Story