Telugu Global
Cinema & Entertainment

సినీనటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్ మంజూరు

మనీలాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను కూడా నిందితురాలిగా పేర్కొంటు అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది.

సినీనటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్ మంజూరు
X

మనీ లాండరింగ్ కేసులో సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. రూ. 2 లక్షల వ్యక్తిగత పూచికత్తును చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కాగా, జాక్వెలిన్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నది. రూ.200 మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌కు జాక్వెలిన్‌కు సంబంధాలు ఉన్నాయి. పలుమార్లు అతడి నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మనీలాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను కూడా నిందితురాలిగా పేర్కొంటు అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. కాగా, జాక్వెలిన్ కేసు దర్యాప్తులో సహకరించడం లేదని, ఆమె విదేశాలకు పారిపోవాలని ప్రయత్నిస్తున్నారని కోర్టులో ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆమెకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు చేసి రిమాండుకు పంపాలని కోరారు.

కాగా, ఇప్పటికే చార్జిషీట్ వేసిన కేసులో ఆమెను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం లేదని జాక్వెలిన్ తరపు న్యాయవాదులు వాదించారు. దర్యాప్తు కూడా పూర్తయ్యిందని.. భవిష్యత్‌లో ఏదైనా విచారణ జరిగితే సహకరిస్తారని లాయర్లు తెలియజేశారు. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు రెండు సార్లు ఆమెను విచారించారని, జాక్వెలిన్ పూర్తిగా సహకరించారని కూడా కోర్టుకు తెలిపారు.ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

First Published:  15 Nov 2022 12:47 PM GMT
Next Story