Telugu Global
Cinema & Entertainment

లూసిఫర్ మరోసారి చూసి రండి

గాడ్ ఫాదర్ సినిమా చూడ్డానికి వచ్చేముందు ఓపిక ఉంటే లూసిఫర్ మరోసారి చూడాలని కోరుతున్నాడు దర్శకుడు మోహన్ రాజా. లూసిఫర్ కంటే గాడ్ ఫాదర్ చాలా బాగుంటుందని చెబుతున్నాడు.

లూసిఫర్ మరోసారి చూసి రండి
X

సాధారణంగా రీమేక్ చేసినప్పుడు, పాత సినిమాను మరిచిపోమంటారు. సేమ్ స్టోరీ కాబట్టి, ఒరిజినల్ మూవీని దృష్టిలో పెట్టుకొని రీమేక్ చూడొద్దని చెబుతుంటారు. కానీ గాడ్ ఫాదర్ విషయంలో మాత్రం దర్శకుడు మోహన్ రాజా రివర్స్ లో చెబుతున్నాడు. గాడ్ ఫాదర్ చూసేముందు, ఓపిక ఉంటే మరోసారి లూసిఫర్ చూసి థియేటర్లకు రావాలని కోరుతున్నాడు ఈ దర్శకుడు. ఇంతకీ ఈ దర్శకుడి ధైర్యం ఏంటి?

"లూసిఫర్ లో లేని ఒక కోణం గాడ్ ఫాదర్ లో ఉంది. కథని అలానే వుంచి ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాను. గాడ్ ఫాదర్ స్క్రీన్ ప్లే చాలా సర్ ప్రైజింగ్ గా, కొత్తగా ఉంటుంది. ఇందులో హీరోతో పాటు మరో 10 పాత్రలు కూడా గెలుస్తాయి. మలయాళంలో చూడని 10 పాత్రలు ఇందులో వేరే రూపంలో ఉంటాయి. ఈ పాత్రలు చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటాయి. ఓపిక వుంటే లూసిఫర్ మరోసారి చూసి గాడ్ ఫాదర్ కోసం థియేటర్లకు రండి."

గాడ్ ఫాదర్ స్క్రీన్ ప్లేను పూర్తిగా మార్చేశామని, అందుకే ఈ సినిమాను మలయాళంలో కూడా ధైర్యంగా రిలీజ్ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు మోహన్ రాజా. గాడ్ ఫాదర్ సినిమాని ఫ్రెష్ స్క్రీన్ ప్లే ప్యాట్రన్ తో చేశామని, ఇందులో భాగంగా చాలా కీలకమైన మార్పులు చేశామని, అది తెలుగు ప్రేక్షకులు కోరుకున్న వినోదాన్ని అందిస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు మోహన్ రాజా.

First Published:  4 Oct 2022 9:44 AM IST
Next Story