Miss Shetty Mr Polishetty | 50 కోట్ల మార్క్ చేరుకున్న శెట్టి కపుల్
Miss Shetty Mr Polishetty - మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరింది. సినిమా సక్సెస్ అయిందంటున్నారు నిర్మాతలు.

Miss Shetty Mr Polishetty Review: మిస్ శెట్టి - మిస్టర్ పొలిశెట్టి – రివ్యూ! {2.5/5}
సకుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఒక కొత్త ప్రయత్నాన్ని మన ఆడియెన్స్ తప్పకుండా రిసీవ్ చేసుకుంటారని ప్రూవ్ చేసిందీ సినిమా. యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోనూ మంచి వసూళ్లు సాధిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తాజాగా 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ మార్క్ కు చేరుకుంది.
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూడో వారంలోనూ స్టడీ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది. ఆడియెన్స్ ఆదరణతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు అందుకుందీ సినిమా.
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో దర్శకుడు మహేష్ బాబు.పి తెరకెక్కించారు. ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టి తన విజయ పరంపరను కొనసాగించగా.. హీరోయిన్ అనుష్క మరోసారి తన మార్క్ చూపించింది. మార్కెట్లో తనకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపించుకుంది.