Telugu Global
Cinema & Entertainment

అల్లరి నరేష్ సరసన మరో హీరోయిన్

రీసెంట్ గా ఉగ్రం పేరిట కొత్త సినిమా స్టార్ట్ చేశాడు అల్లరి నరేష్. ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. తాజాగా ఇందులో హీరోయిన్ ను ఎంపిక చేశారు.

అల్లరి నరేష్ సరసన మరో హీరోయిన్
X

హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో రెండో చిత్రంగా 'ఉగ్రం' తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ క్యూరియాసిటీ పెంచింది. ఫస్ట్ లుక్‌ లో అల్లరి నరేష్ శరీరం నిండా గాయాలతో ఎగ్రెసివ్ గా కనిపించాడు.

ఇక ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ గా మిర్నా మీనన్ ని ఎంపిక చేశారు. మిర్నా ఇంతకుముందు మోహన్ లాల్ బిగ్ బ్రదర్‌ తో పాటు తమిళం, మలయాళంలో కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో ఆమెకు ఇది రెండో సినిమా.

తన తొలి చిత్రంగా విలక్షణమైన కథతో నాంది సినిమాను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కనకమేడల, ఉగ్రం కోసం పవర్ ఫుల్ కథను సిద్దం చేశారు. ఇందులో నరేష్ ని చాలా డిఫరెంట్ రోల్ లో ప్రెజెంట్ చేస్తున్నారు. సినిమాలో నరేష్ ది పోలీస్ పాత్ర అని తెలుస్తోంది.

కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్ వంటి పలు ప్రాజెక్టులను నిర్మించిన నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

First Published:  4 Sept 2022 12:28 PM IST
Next Story