Telugu Global
Cinema & Entertainment

Meher Ramesh | కీర్తిసురేష్ బాగా ప్లస్ అవుతుందంటున్న మెహర్

Meher Ramesh - భోళాశంకర్ సినిమాకు కీర్తిసురేష్ చాలా ప్లస్ అవుతుందంటున్నాడు మెహర్. సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.

Meher Ramesh | కీర్తిసురేష్ బాగా ప్లస్ అవుతుందంటున్న మెహర్
X

చిరంజీవి హీరోగా నటించిన సినిమా భోళాశంకర్. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీర్తిసురేష్ నటించింది. ఆమె ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చిందనే విషయాన్ని దర్శకుడు మెహర్ రమేష్ వెల్లడించాడు.

"మెగాస్టార్ కి ఒక మెగా నటి కావాలి. స్వప్న దత్ ద్వారా ఈ పాత్ర గురించి కీర్తిసురేష్ కు చెప్పడం జరిగింది. స్వప్నదత్ కి థాంక్స్ చెప్పాలి. ఈ కథ లోని ఎమోషన్ కి కీర్తి సురేష్ చాలా కనెక్ట్ అయ్యింది. కథ చెప్పిన వెంటనే చేస్తానని చెప్పింది. వాల్తేరు వీరయ్యలో బ్రదర్ సెంటిమెంట్ గా రవితేజ ఎసెట్. ఇందులో కీర్తి సురేష్ పాత్ర కూడా సిస్టర్ సెంటిమెంట్ గా హైలెట్ అవుతుంది. అలాగే తమన్నా, సుశాంత్ పాత్రలు కూడా చాలా చక్కగా కుదిరాయి. పాత్రలన్నీ చాలా మంచి వినోదం పంచుతాయి."

ఇలా భోళాశంకర్ లోకి కీర్తిసురేష్ ఎలా వచ్చిందనే విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు మెహర్. వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది భోళాశంకర్. చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ఇది టేకప్ చేశానని చెబుతున్నాడు.

"చిరంజీవిని అన్నయ్య అని పిలవడం తప్పితే మరో పదం ఉండదు. ఇందులో అన్నయ్య తత్త్వం కూడా ఉంది. అది నాకు చాలా నచ్చింది. జనరేషన్ మారినా అనుబంధాలు అలానే ఉన్నాయి. యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు బ్రదర్ సిస్టర్ ఎమోషన్ ఉన్న కథ ఇది. నేను ఇలాంటి సబ్జెక్ట్ ఎప్పుడూ డీల్ చేయలేదు. చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా ఇందులో మార్పులు చేశాం. సెకండ్ హాఫ్ లో చిరంజీవి పాత్రకి ఇచ్చిన ట్రీట్ మెంట్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒరిజినల్ కి దాదాపు 70 శాతం మార్పులు చేశాం. అన్నయ్య నాకు ఎలా కనిపిస్తారో అది ఈ సినిమాలో చూపించా. అన్నయ్య నాకు హిమాలయ శిఖరం లా కనిపిస్తారు."

ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది భోళాశంకర్ సినిమా. అనీల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్న హీరోయిన్ గా నటించింది. మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు.

First Published:  8 Aug 2023 3:41 PM GMT
Next Story