Telugu Global
Cinema & Entertainment

‘విశ్వంభ‌ర’ టీజ‌ర్ విడుదల..ఇక మెగా ఫ్యాన్స్‌కు దసరా పండుగే

మెగాస్టార్ చిరంజీవి, యువ‌ దర్శకుడు వశిష్ఠ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం విశ్వంభ‌ర‌. ద‌స‌రా సంద‌ర్భంగా మూవీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

‘విశ్వంభ‌ర’ టీజ‌ర్ విడుదల..ఇక మెగా ఫ్యాన్స్‌కు దసరా పండుగే
X

మెగా ఫ్యాన్స్‌కు ద‌స‌రా కానుక‌గా విశ్వంభ‌ర టీజ‌ర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మెగా స్టార్ చిరంజీవి, యువ‌ దర్శకుడు వశిష్ఠ కాంబినేష‌న్‌లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియ‌న్ మూవీ విశ్వంభ‌ర.. ఈ మూవీ టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ విడుద‌ల చేసింది. ఈ సినిమాలో చిరు యాక్టింగ్ ఇరగదీశారు. మాస్‌ లూక్‌తో, పవర్‌ఫుల్‌ డైలాగులు, గ్రాండ్‌ విజువల్స్‌తో ఈ టీజర్‌ ఆద్యంతం సినీప్రియులను అలరించేలా సాగింది. టీజ‌ర్ చూస్తున్నంత సేపు వేరే ప్ర‌పంచంలోకి వెళ్లి వ‌చ్చామా అన్న‌ట్లు ఉంది.టీజ‌ర్‌లో గ్రాఫిక్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి..

అత్యున్నత టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘విశ్వంభర’ను తీర్చిదిద్దుతున్నట్లు టాక్‌. మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా ఇది నిలిచిపోనుంది. ఈ మూవీ కోసం 13 భారీ సెట్‌లతో విభిన్న ప్రపంచాన్ని సృష్టించారు. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ బ‌డ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. అస్కార్ అవార్డు విజేత‌ ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తున్నారు.

First Published:  12 Oct 2024 6:53 AM GMT
Next Story