మై డియర్ బ్రదర్...నీ స్పీచ్‌కు మంత్రముగ్ధుడినయ్యాను
జనసేన పార్టీ 12 ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగంపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా ప్రశంసలు
BY Raju Asari15 March 2025 9:49 AM IST

X
Raju Asari Updated On: 15 March 2025 9:49 AM IST
జనసేన పార్టీ 12 ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ పెట్టారు. ఎక్స్ వేదికగా తన తమ్ముడి స్పీచ్‌ను ప్రశంసించారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.'మై డియర్ బ్రదర్ పవన్ కల్యాణ్.. జనసేన జయకేత సభలో నీ స్పీచ్‌కు మంత్రముగ్ధుడినయ్యాను. సభకొచ్చిన అశేష జనసంద్రంలానే నా మనసు కూడా ఉప్పొంగింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. జనసేన ఆవిర్భావ సభ పిఠాపురంలో ఘనంగా జరిగింది. ఈ సభకు జన సైనికులు, పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అనేక అంశాలపై ఉద్దేగంగా ప్రసంగించారు.
Next Story