Telugu Global
Cinema & Entertainment

Meera Chopra | మరో హీరోయిన్ పెళ్లికి రెడీ

Meera Chopra: ఇప్పుడు మీరా చోప్రా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమౌతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి 11న మీరా చోప్రా పెళ్లి ఉంటుంది.

Meera Chopra | మరో హీరోయిన్ పెళ్లికి రెడీ
X

బాలీవుడ్ లో మరో హీరోయిన్ పెళ్లికి సిద్ధమైంది. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు మీరా చోప్రా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమౌతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి 11న మీరా చోప్రా పెళ్లి ఉంటుంది.

ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తతో దాదాపు ఆరేళ్లుగా డేటింగ్ లో ఉంది మీరా చోప్రా. బాలీవుడ్ లో చిన్న సినిమాలు చేస్తూ, మరోవైపు ఓటీటీలో నటిస్తూ, ఇంకోవైపు ఇలా లవ్ లైఫ్ ను కొనసాగిస్తోంది. ఇప్పుడీ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

జైపూర్ లోనే ఓ ప్యాలెస్ లో మీరా చోప్రా పెళ్లి జరుగుతుంది. తనకు కాబోయే భర్త వివరాల్ని ఇప్పటివరకు బయటకు వెళ్లడించలేదు మీరా చోప్రా. మరికొన్ని రోజుల్లో ఈ వివరాలు బయటకు రాబోతున్నాయి. తెలుగులో బంగారం, వాన లాంటి సినిమాలతో ఈమె గుర్తింపు తెచ్చుకుంది.

ఇక రకుల్ ప్రీత్ విషయానికొస్తే, గోవాలో ఈమె వివాహం అట్టహాసంగా జరిగింది. 3 రోజుల పెళ్లి వేడుక తర్వాత తిరిగి సినిమాల్లో బిజీ కానుంది రకుల్. ప్రస్తుతానికి ఆమె హనీమూన్ ప్లాన్ చేయడం లేదు. ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తయిన తర్వాత హనీమూన్ కు వెళ్తారు రకుల్-జాకీ భగ్నానీ జంట.

First Published:  23 Feb 2024 7:43 AM IST
Next Story