Meenakshi Chaudhary: వెంకీ సరసన గుంటూరుకారం బ్యూటీ
Meenakshi Chaudhary: గుంటూరుకారం బ్యూటీ మరో బంపరాఫర్ కొట్టేసింది. వెంకీ సరసన నటించబోతోంది.

Meenakshi Chaudhary: వరుస అవకాశాలతో దూసుకుపోతోంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. గుంటూరుకారం సినిమా ఫ్లాప్ అయినా, అందులో ఆమె లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టులో అవకాశం అందుకుంది ఈ పొడుగుకాళ్ల సుందరి.
త్వరలోనే వెంకటేష్ హీరోగా ఓ సినిమా తీయబోతున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని అనుకుంటున్నారు. మీనాక్షి చౌదరి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
సైంధవ్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే సందిగ్దంలో పడ్డారు వెంకటేశ్. ప్రతిష్టాత్మక 75వ సినిమా ఫ్లాప్ అవ్వడంతో, 76వ సినిమా కోసం చాలా కేర్ తీసుకుంటున్నాడు. అటు అనీల్ రావిపూడి కూడా భగవంత్ కేసరి సినిమా తర్వాత కామెడీ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇలా ఎఫ్2, ఎఫ్3 సినిమాల తర్వాత అనీల్ రావిపూడి, వెంకటేష్ మరోసారి కలిశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో 3 సినిమాలున్నాయి. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు.