Telugu Global
Cinema & Entertainment

Tillu Square: టిల్లూ హీరోయిన్ మళ్లీ మారిపోతోందా?

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమా టిల్లు స్క్వేర్. ఈ సినిమా నుంచి ఇప్పటికే ముగ్గురు తప్పుకున్నారు. ఇప్పుడు నాలుగో హీరోయిన్ వచ్చి చేరింది.

Tillu Square: టిల్లూ హీరోయిన్ మళ్లీ మారిపోతోందా?
X

డీజే టిల్లూ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది టిల్లూ స్క్వేర్. ఈ సినిమాలో హీరోయిన్ మారిపోయిందనే విషయాన్ని మొన్ననే చెప్పుకున్నాం. అంతలోనే ఈ ప్రాజెక్టులో హీరోయిన్ మరోసారి మారిపోయింది. తాజాగా మీనాక్షి చౌదరి పేరు తెరపైకొచ్చింది.

ఈ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ తప్పుకుందనే న్యూస్ బయటకొచ్చిన వెంటనే, ఆ స్థానంలోకి మడొన్నా సెబాస్టియన్ ను తీసుకున్నారనే టాక్ కూడా వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం, మడొన్నా ఈ సినిమాలో దాదాపు ఫిక్స్ అయింది.

అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. వీళ్లిద్దరి కంటే ముందే హీరోయిన్ శ్రీలీల ఇందులో నటించింది. టిల్లూ స్క్వేర్ కోసం ముందుగా శ్రీలీలను తీసుకున్నారు. ఆమె 5 రోజులు షూటింగ్ కూడా చేసింది, ఆ వెంటనే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అలా టిల్లూ స్క్వేర్ ప్రాజెక్టులో హీరోయిన్లు వరుసపెట్టి మారిపోతున్నారు.

ఇప్పుడు మడొన్నా కూడా తప్పుకొని, ఆ స్థానంలో మీనాక్షి చౌదరి వచ్చినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా హిట్-2తో హిట్ కొట్టింది మీనాక్షి.

First Published:  9 Dec 2022 4:04 AM GMT
Next Story