Tiger Nageswara Rao | రవితేజ మూవీ నుంచి మాస్ సాంగ్ రిలీజ్
Tiger Nageswara Rao - టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి సెకెండ్ సాంగ్ రిలీజైంది. ఈసారి మాస్ సాంగ్ రిలీజ్ చేశారు.

‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్ రవితేజ పాత్రను పరిచయం చేయగా, ట్రైలర్ మనల్ని అతిపెద్ద గజదొంగ ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఫస్ట్ సింగిల్ ఏక్ దమ్ రొమాంటిక్ సైడ్ చూపించింది. ఇప్పుడు విడుదలైన సెకెండ్ సింగిల్ టైగర్ పాత్రను వివరిస్తోంది.
జివి ప్రకాష్ కుమార్ పవర్ ఫుల్ బీట్‌లతో కూడిన మ్యాసియస్ట్ పాటను స్కోర్ చేశారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ రాసిన లిరిక్స్ లార్జర్ దేన్ లైఫ్ గా మాస్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. సింగర్ అనురాగ్ కులకర్ణి తన పవర్ ఫుల్ వాయిస్ తో పాటకు మరింత ఎనర్జీ జోడించాడు.
విజువల్స్, ఫైర్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. లిరికల్ వీడియోను బట్టి చూస్తే, రవితేజ కనికరం లేని గజదొంగ పాత్రలో నటించాడని అర్థమౌతోంది. ఎవరైనా తన దారికి అడ్డువస్తే వదిలిపెట్టడని తెలుస్తోంది. దర్శకుడు వంశీ, ఈ పాత్రను మాస్ ఎలిమెంట్స్ తో నింపేశాడు. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లు తమ బలమైన హావభావాలతో రవితేజ పాత్రకు మరింత ఎలివేషన్ ఇచ్చారు. ఈ పాట మాస్‌ని కట్టిపడేస్తుంది.
ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 చిత్రాలను రూపొందించిన నిర్మాత అభిషేక్ అగర్వాల్, టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని నిర్మించాడు. నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు.