Telugu Global
Cinema & Entertainment

Mass Maharaju | రాజ్ తరుణ్ సినిమా షూటింగ్ అప్ డేట్స్

Mass Maharaju - రాజ్ తరుణ్ సైలెంట్ గా మరో సినిమా పూర్తి చేస్తున్నాడు. ఆ సినిమా పేరు మాస్ మహారాజు.

Mass Maharaju | రాజ్ తరుణ్ సినిమా షూటింగ్ అప్ డేట్స్
X

మాస్ మహారాజు.. ఇది రవితేజ బిరుదు కాదు, ఓ సినిమా పేరు. పైగా మల్టీస్టారర్. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న సినిమాకు ఈ పేరు పెట్టిన సంగతి తెలిసిందే. సన్ రైజ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత స్వాతి రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజ్ తరుణ్ , సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న మాస్ మహారాజు సినిమాకు సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి షెడ్యుల్ జరుపుకుంటుంది. గదర్ 2 హీరోయిన్ సిమ్రత్ కౌర్, బిచ్చగాడు ఫేమ్ సాట్న టైటస్, సంపద హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, సత్యం రాజేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ చాలా డిఫరెంట్ లుక్స్ లో ఈ మూవీలో కనిపించబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో కొత్తగా కనిపిస్తున్నారు ఈ ఇద్దరు హీరోలు.

1980 బ్యాక్ డ్రాప్ లో వస్తోంది మాస్ మహారాజు సినిమా. డిఫరెంట్ స్టోరీతో వస్తున్న ఈ సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు, యాక్షన్ అంశాలు కూడా ఉంటాయంటున్నారు మేకర్స్. త్వరలో విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.

First Published:  7 Sept 2023 11:45 AM IST
Next Story