Telugu Global
Cinema & Entertainment

Masooda Movie: మసూద సినిమా విడుదల తేదీ ఫిక్స్

తెలుగు తెర పైకి మరో డిఫరెంట్ మూవీ వస్తోంది. దీని పేరు మసూద. ఈ మూవీ ని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు

Masooda Movie: మసూద సినిమా విడుదల తేదీ ఫిక్స్
X

'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై వస్తున్న మూడో సినిమా 'మసూద'. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు.


ఇంతకుముందు రాహుల్ యాదవ్ తీసిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మళ్లీ రావా సినిమాలంటే దిల్ రాజుకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే రాహుల్ మూడో సినిమాను రిలీజ్ చేసేందుకు దిల్ రాజు ముందుకొచ్చారు. అలా ఓ చిన్న సినిమాకు భారీ ఎత్తున థియేటర్లు దొరుకుతున్నాయన్నమాట.


ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన తిరువీర్, ఈ సినిమాలో హీరోగా నటించగా, సీనియర్ నటి సంగీత ఓ కీలక పాత్రలో కనిపించనుంది. కావ్య కళ్యాణ్ రామ్, బాందవి శ్రీధర్ హీరోయిన్లుగా నటించారు. ప్రశాంత్ విహారి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రచారం మొదలైంది. త్వరలోనే ట్రయిలర్ రిలీజ్ చేసి, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెడతారు.

First Published:  9 Nov 2022 6:52 PM IST
Next Story