Telugu Global
Cinema & Entertainment

Manorathangal | లెజెండ్స్ తో ఆంథాలజీ

Manorathangal Anthology - అద్భుతమైన వెబ్ సిరీస్ వస్తోంది. కమల్, మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి లెజెండ్స్ నటించారిందులో.

Manorathangal | లెజెండ్స్ తో ఆంథాలజీ
X

ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే అద్భుతమైన ఆంథాలజీ రాబోతోంది. దీని వెనక ఓ సదుద్దేశం ఉంది. ఓ గొప్ప వ్యక్తికి నివాళులు అర్పిస్తూ ఈ సిరీస్ తెరకెక్కింది. మలయాళ దిగ్గజ రచయిత వాసుదేవన్ నాయర్ 90వ పుట్టినరోజును పురస్కరించుకొని, ఆయన రచించిన 9 కథల్ని తీసుకొని ఈ ఆంథాలజీ తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ పేరు‘మనోరథంగల్’.

ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. కమల్ హాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్ లాంటి దిగ్గజ నటులు ఇందులో నటించారు. ఆగస్ట్ 15న ఈ ఆంథాలజీని అన్ని సౌత్ భాషలతో పాటు, హిందీలో స్ట్రీమింగ్ కు పెట్టబోతోంది జీ5.

ఈ వెబ్ సిరీస్ లో 9 కథలున్నాయి. తొమ్మిది కథలకూ ఓ కనెక్షన్ ఉంటుంది. 9 మంది సూపర్ స్టార్‌లు, 8 మంది లెజెండరీ దర్శకులతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కడం విశేషం.

మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాసిల్ తో పాటు.. జరీనా, బిజు మీనన్, కైలాష్, ఇంద్రన్స్, నేదుముడి వేణు, ఎంజీ పనికర్, సురభి లక్ష్మి, ఇంద్రజిత్, అపర్ణ బాలమురళి, శాంతికృష్ణ, జాయ్ మాథ్యూ, పార్వతి తిరువోతు, హరీష్ ఉత్తమన్, మధు, ఆసిఫ్ అలీ లాంటి వంటి వారు ఈ 9 కథల్లో నటించారు. వీటికి ప్రియదర్శన్, రంజిత్, శ్యామప్రసాద్, జయరాజన్ నాయర్, సంతోష్ శివన్, రతీష్ అంబట్, అశ్వతి నాయర్ వంటి వారు దర్శకత్వం వహించారు.

First Published:  16 July 2024 4:06 PM GMT
Next Story