Mangalavaaram OTT | ఓటీటీలోకి పాయల్ రాజ్ పుత్ సినిమా!
Mangalavaaram Movie OTT: పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ పోషించిన మంగళవారం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ చెక్ చేద్దాం..

Mangalavaaram Movie OTT: పాయల్ రాజ్‌పుత్ నటించిన మంగళవారం ఇప్పుడు ఓటీటీలో ప్రత్యక్షమైంది. డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగుతో పాటు.. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా మంగళవారం. గ్రామీణ నేపథ్యంలో థ్రిల్లర్ గా తీసిన ఈ సినిమాకు థియేటర్లలో మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. ఓవరాల్ గా సినిమా నిలదొక్కుకోలేకపోయింది.
రిలీజ్ కు ముందు సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. రిలీజ్ తర్వాత మౌత్ టాక్ కూడా బాగానే వచ్చింది. అయితే అదే టైమ్ లో వరల్డ్ కప్ కూడా ఉండడంతో మంగళవారం సినిమాను ప్రేక్షకులు పట్టించుకోలేదు. అంతా టీవీలకు అతుక్కుపోయారు. ఫలితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోలేకపోయింది.
వరల్డ్ కప్ కారణంగా దెబ్బతిన్న ఈ సినిమా, ఓటీటీలో క్లిక్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రియదర్శి కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను.. స్వాతి రెడ్డి, సురేష్ వర్మలతో కలిసి అజయ్ భూపతి నిర్మించాడు. ఈ సినిమాతో అజయ్ భూపతి మంచి టెక్నీషియన్ గా గుర్తింపు పొందాడు.